సక్సెస్‌ కోసం సీఎం సెంటిమెంట్‌

mahesh babu sentiment for Bharath ane nenu movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు బ్యాక్‌ టు బ్యాక్‌ ‘బ్రహ్మోత్సవం’ మరియు ‘స్పైడర’ చిత్రాలతో డిజాస్టర్‌ను చవి చూసిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన స్పైడర్‌’ చిత్రం మహేష్‌ కెరీర్‌లోనే అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచిన నేపథ్యంలో తాజాగా మహేష్‌ నటించిన చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు. శ్రీమంతుడు చిత్రంలో మహేష్‌బాబు లుంగీ కట్టి మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో కూడా మాస్‌ ఆడియన్స్‌ టార్గెట్‌ చేసిన మహేష్‌బాబు లుంగీ కట్టి మెప్పించబోతున్నాడు.

‘శ్రీమంతుడు’ చిత్రంలో లుంగీ కట్టడం వల్ల బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ దక్కిందని, అందుకే భరత్‌ అనే నేను చిత్రంలో కూడా మహేష్‌బాబు లుంగీ కట్టినట్లుగా తెలుస్తోంది. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా కూడా సక్సెస్‌ కోసం అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సిల్లీ సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతూ ఉంటాడు. అందుకు మహేష్‌బాబు కూడా అతీతుడు కాదు అని లుంగీ సెంటిమెంట్‌ ద్వారా తేలిపోయింది. భరత్‌ అనే నేను చిత్రం సూపర్‌ హిట్‌ అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో చేయబోతున్న చిత్రాల్లో కూడా మహేష్‌బాబు లుంగీలో మెరుస్తాడేమో చూడాలి. ఈనెల 20న విడుదల కాబోతున్న ‘భరత్‌ అనే నేను’ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.