రిలీజ్ కి ముందే స్పైడర్ రివ్యూ షాక్.

mahesh babu spyder movie review goes viral on cell phones

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ సినిమా రిలీజ్ కాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినిమా విడుదలకి ముందే ఇంటర్నెట్ లో ఆ సినిమాకి సంబంధించిన దృశ్యాలు కనిపించడం కామన్ అయిపోయింది. సినీ పరిశ్రమని అంతగా వేధిస్తున్న పైరసీ బారిన పడకుండా చూసేందుకు స్పైడర్ టీం సాంకేతికంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఇటీవల విడుదల అయిన జైలవకుశలోని కొన్ని దృశ్యాలు కూడా నెట్ లో దర్శనం ఇవ్వడంతో ఈ విషయం మీద స్పైడర్ టీం ప్రత్యేక దృష్ఠి పెట్టింది.

ఇలా రిలీజ్ కి స్పైడర్ బయటపడకుండా దర్శకనిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు ఫలిస్తాయో,లేదో తెలియదు గానీ ఆ సినిమాకి సంబంధించిన టాక్, రివ్యూ రాకుండా మాత్రం ఆపలేకపోయారు. స్పైడర్ లోని కీలక అంశాల్ని టచ్ చేసిన ఈ సినిమా రివ్యూ షార్ట్ ఫార్మాట్ ఇప్పుడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లోని సెల్ ఫోన్స్ లో హల్ చెల్ చేస్తోంది. కావాలంటే మీరూ ఓ లుక్ వేయండి.