వెండితెర క‌పిల్ దేవ్..ర‌ణ్ వీర్ సింగ్..

ranveer-singh-will-act-in-cricketer-kapil-dev-in-a-biopic-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలీవుడ్ లో ఇప్పుడు మంచి క్రేజ్ ఉన్న హీరో ఎవ‌రంటే టక్కున వినిపించే పేరు ర‌ణ్ వీర్ సింగ్. వ‌రుస హిట్ల‌తో బాలీవుడ్ లో స్టార్ హోదా సంపాదించుకున్నాడు ర‌ణ్ వీర్. కాస్త ప్ర‌యోగాత్మ‌కంగా అనిపించే ఏ సినిమాక‌యినా…హీరోగా ర‌ణ్ వీర్ పేరు ముందుగా గుర్తొస్తోంది బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు. స‌హ‌జంగా న‌టించాల్సి వ‌చ్చే బ‌యోపిక్ ల‌క‌యితే..ర‌ణ్ వీర్ ను మించిన ఆప్ష‌న్ క‌నిపించ‌డం లేదు. బాజీరావ్ మ‌స్తానీ తో తానేంటో నిరూపించుకున్న ర‌ణ్ వీర్ చిత్తోర్ రాణి ప‌ద్మినీ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న ప‌ద్మావ‌తిలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మ‌రో బ‌యోపిక్ లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది ర‌ణ్ వీర్ కు. భార‌త్ కు క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ మ‌జా చూపించిన క‌పిల్ దేవ్ జీవిత గాథ‌ను తెర‌కెక్కించాల‌ని చానాళ్ల నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు క‌బీర్ ఖాన్ .

క‌పిల్ దేవ్ పాత్ర కోసం ఆయ‌న అనేక‌మంది హీరోల పేర్లు ప‌రిశీలించాడు. ఈ క్ర‌మంలో కొన్నాళ్లు అక్ష‌య్ కుమార్, హృతిక్ రోష‌న్ లో ఎవ‌రో ఒక‌రు క‌పిల్ పాత్ర పోషిస్తార‌నే వార్త‌లొచ్చాయి. త‌ర్వాత అర్జున్ క‌పూర్ పేరూ వినిపించింది. కానీ చివరికి క‌బీర్ ఖాన్ ర‌ణ్ వీర్ సింగ్ ను క‌పిల్ దేవ్ గా ఎంచుకున్నాడు. ఎత్తుగా, పొడ‌వైన కాళ్ల‌తో ఉండే క‌పిల్ పాత్ర‌కు ర‌ణ్ వీర్ సింగ్ అయితే స‌రిగ్గా సూట‌వుతాడ‌ని క‌బీర్ ఖాన్ భావిస్తున్నాడు. ఈ నెల 27 న ముంబైలో మూవీ ఎనౌన్స్ మెంట్ కార్య‌క్ర‌మాన్ని భారీ స్థాయిలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి 1983లో ప్ర‌పంచ‌క‌ప్ ఆడిన భార‌త జ‌ట్టు స‌భ్యులంతా హాజ‌ర‌వ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంది. 1983లో ప్ర‌పంచ‌క‌ప్ జ‌రిగిన ఇంగ్లాండ్ ప్రాంతంలోనే సినిమా షూటింగ్ జ‌ర‌పాల‌ని క‌బీర్ ఖాన్ ప్లాన్ చేస్తున్నాడు. అంటే వెండితెర క‌పిల్ దేవ్ గా ర‌ణ్ వీర్ లార్డ్స్ మైదానంలో ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నున్నాడ‌న్న‌మాట‌.