వామ్మో… 15 నిమిషాల‌కు రూ. 5 కోట్లా?

Ranveer Singh takes 5 crores for 15 minutes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏప్రిల్ 7న ప్రారంభ‌మ‌య్యే ఐపీఎల్ 11 సీజ‌న్ కోసం క్రికెట్ అభిమానులంతా ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ లో మ్యాచ్ లతో పాటు అభిమానులంతా బాగా ఎంజాయ్ చేసేది ప్రారంభోత్స‌వ‌వేడుక‌ల‌ని. గ‌త ప‌దేళ్ల‌గా ఈ వేడుక‌ల‌కు బాలీవుడ్ రంగులద్దుతోంది. ఈ ఏడాదికూడా ఎప్ప‌టిలానే బాలీవుడ్ తార‌ల‌తో ఆడిపాడించాల‌ని ఐపీఎల్ నిర్వాహ‌కులు భావించారు. వ‌రుస విజ‌యాల‌తో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపుతున్న ర‌ణ్ వీర్ సింగ్ ను క‌లిసి ఆరంభ‌వేడుక‌ల్లో డ్యాన్స్ చేయాల‌ని కోరారు.

అస‌లే బాలీవుడ్ లో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ యూత్ హీరో. ఆపై ఐపీఎల్… ఇంకేముంది… త‌న రేంజ్ఐ, పీఎల్ రేంజ్ బేరీజు వేసి, భారీ డిమాండ్ నిర్వాహ‌కుల ముందుంచాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. పావుగంట ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డానికి రూ. 5 కోట్లు అడిగాడు. ఈ పారితోష‌కం విన‌గానే మ‌న‌కు క‌ళ్లు తిరుగుతాయి కానీ… ఐపీఎల్ అంటే కోట్లరూపాయ‌లు చేతులుమారే ఆట‌క‌దా… వారికేమీ ఆశ్చ‌ర్యం అనిపించ‌లేదు. ర‌ణ్ వీర్ అడిగినంతా ఇవ్వ‌డానికి వారు సంతోషంగా అంగీక‌రించారు. రామ్ లీలా, బాజీరావ్ మ‌స్తానీ, ప‌ద్మావ‌త్ వంటి సినిమాల‌తో ర‌ణ్ వీర్ బాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడంటూ వెలువ‌డుతున్న విశ్లేష‌ణ‌ల్లో నిజం ఉంద‌ని…ఐపీఎల్ కోసం ఆయ‌న అందుకుంటున్న‌పారితోష‌కం చూస్తే అర్ధ‌మ‌వుతోంది.