పెళ్ళయిన పది రోజులకే రణ్ దీర్ వచ్చాడు…!

Newlywed Ranveer Singh Returns To Work After Wedding With Deepika Padukone

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం టెంపర్ ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం ను దక్కించుకున్నది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళం, హిందీ బాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళం లో మాస్ హీరో విశాల్ అయోగ్య పేరుతో నటిస్తున్నాడు. ఇటివల ఈ చిత్రం కు సంబందించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కి తమిళ, తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. హిందిలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ సింబ పేరుతో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి రూపొందిస్తున్నాడు.

Ranveer-Singh

ఇటివల దీపిక పదుకునేతో వివాహం చేసుకున్నా రణవీర్ సింగ్ పెండ్లి అయినా పది రోజులకే సింబా చిత్రంకు డబ్బింగ్ చెప్పడానికి వచ్చేశాడు. అసలు విషయం ఏమిటి అంటే సింబా విడుదల తేది దగ్గర పడుతుండటంతో, తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి విచ్చేశాడు. అది తనకు సినిమా పైన ఉన్న డెడికేషన్ అని ఆ చిత్ర బృందం గుసగుస లు అడుతున్నారంట. వచ్చే నెల 3వ తేదిన సింబా ట్రైలర్ ను విడుదల చెయ్యనున్నారు. అదే నెల 28న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వుతుంది. సింబా డబ్బింగ్ సెట్లో రోహిత్ శెట్టితో తీసుకున్న సేల్ఫిని రణవీర్ సింగ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.