భ‌న్సాలీతో మ‌రో మూడుసినిమాల్లో రామ్ లీలా జంట‌

Three-films deal for Ranveer and Deepika from Bhansali direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్ వీర్ సింగ్, దీపికా ప‌డుకునే క‌లిసి న‌టించిన మూడుసినిమాలు రామ్ లీలా, బాజీరావ్ మ‌స్తానీ, ప‌ద్మావ‌త్ సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదుచేసుకున్నాయి. రామ్ లీలాతో ఈ జంట చేసిన మ్యాజిక్ ప్రేక్ష‌కుల‌నే కాక భ‌న్సాలీని కూడా క‌ట్టిప‌డేసింది. అందుకే త‌ర్వాతి రెండు సినిమాలకు కూడా వారిద్ద‌రినే ఎంపిక చేసుకున్నాడు. బాలీవుడ్ లో తాజాగా వినిపిస్తున్న క‌బురేంటంటే మూడు సినిమాల త‌ర్వాత కూడా భ‌న్సాలీకి ఈ జంట న‌ట‌న బోర్ కొట్ట‌లేదు. అందుకే మ‌రో మూడు సినిమాలు వారితోనే చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నాడు.

ఈ మేర‌కు వారితో ఆరేళ్ల‌పాటు డీల్ కూడా కుదుర్చుకున్న‌ట్టు ఆసియ‌న్ ఏజ్ అనే ప‌త్రిక ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. వారిద్దరి న‌ట‌న మాత్ర‌మే కాక ప్రొఫెష‌న్ ప‌ట్ల వారి అంకిత‌భావం కూడా భ‌న్సాలీకి బాగా న‌చ్చ‌డంతో డీల్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపింది. నిజానికి ఇలాంటి డీల్ ఒక‌టి కుదుర్చుకోక‌పోయినప్ప‌టికీ..భ‌న్సాలీ కొన్నేళ్లుగా ర‌ణ్ వీర్, దీపికతోనే క‌లిసి ప‌నిచేస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా డీల్ కుదుర్చుకున్నారు. త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లెక్కనున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో పెళ్లికి ముందూ, త‌ర్వాత కూడా న‌టించేట్టుగా ఈ జంట భ‌న్సాలీకి ఆరేళ్ల‌కు స‌రిప‌డా డేట్లు ఇచ్చేసింద‌న్న‌మాట‌.