మామూలు ఫ్లాప్‌ కాదు.. అట్టర్‌ ఫ్లాప్‌

intelligent movie 20 crore loss for producer c kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా మేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో సి కళ్యాణ్‌ నిర్మించిన ‘ఇంటిలిజెంట్‌’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. మూస కథ కథనాలతో దర్శకుడు వినాయక్‌ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాడు అంటూ ప్రేక్షకులు తేల్చి పారేశారు. వినాయక్‌ గత చిత్రం ఖైదీ నెం.150 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సి కళ్యాణ్‌ ఆయనపై చాలా నమ్మకం పెట్టాడు. ప్రమోషన్‌ ఖర్చుతో కలిపి ఏకంగా 30 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. సినిమాపై పెద్దగా అంచనాలు రాని కారణంగా సినిమాను డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో నిర్మాత కళ్యాణ్‌ తక్కువ రేటుకు అన్ని ఏరియాల్లో సినిమాను అమ్మేశాడు.

సినిమా విడుదల తర్వాత లాభాలు వస్తాయని నిర్మాత భావించాడు. కాని తీరా సినిమా విడుదలైన తర్వాత ఫలితం తారు మారు అయ్యింది. ఈ చిత్రం కనీసం 7 కోట్లను కూడా వసూళ్లు చేయలేక పోయింది. ఇతర రైట్స్‌ ద్వారా మూడు కోట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 10 కోట్ల వరకు ఈ చిత్రం ద్వారా వచ్చాయని చెప్పుకోవచ్చు. అంటే 20 కోట్ల మేరకు నిర్మాతకు టోపీ పడ్డట్లే అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. గతంలో తేజూ నటించిన ఏ చిత్రం కూడా ఇంత భారీ స్థాయిలో నష్టాన్ని చవి చూడలేదంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇది ఫ్లాప్‌ కాదు, అట్టర్‌ ఫ్లాప్‌ అంటూ సోషల్‌ మీడియాలో జోకులు పేళుతున్నాయి. సాయి ధరమ్‌ తేజ్‌ ఇకపై అయినా కాస్త జాగ్రత్తగా ఉండకుంటే మరింతగా కష్టాు తప్పవు అంటూ సినీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.