అంజలి చెల్లి హీరోయిన్‌.. పబ్లిసిటీ కోసం పుకార్లు

Actress Anjali Clarifies On Rumours About Her Sister Debut In Movies
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగమ్మాయి అంజలి ప్రస్తుతం వరుసగా తమిళంలో సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఈ అమ్మడు తెలుగులో కూడా అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తుంది. తెలుగులో ఈ అమ్మడు చేసిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో నటించే అవకాశాలు బాగానే వచ్చాయి. కాని స్టార్‌ హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. తెలుగుతో పోల్చితే తమిళంలో ఈ అమ్మడికి ఎక్కువ గుర్తింపు దక్కింది. అందుకే తమిళనాట ఈ అమ్మడు హీరోయిన్‌గా వరుసగా చిత్రాలు చేస్తోంది. ఈ సమయంలోనే అంజలి చెల్లి ఆరాధ్య హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది అంటూ తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కాస్త తెలుగు రాష్ట్రాలకు సైతం వ్యాప్తి చెందాయి.

అంజలి చెల్లి ఆరాధ్య అంటూ ఒక అమ్మాయి ఫొటో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాని అవన్ని ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. తాజాగా అంజలి స్వయంగా ఈ విషయమై స్పందించింది. తన చెల్లి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా మీడియాలో మరియు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని, అసలు నాకు చెల్లి లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అంజలికి ఒక అక్క మాత్రమే ఉంది, ఆమెకు వివాహం అయ్యి సెటిల్‌ అయ్యింది. కనీసం బందువుల అమ్మాయి కూడా ఆరాధ్య అనే అమ్మాయి లేదు అని, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న ప్రచారం అంటూ అంజలి చెప్పుకొచ్చింది.

అంజలి చెల్లిని అంటూ ప్రచారం చేసుకుంటే ఎక్కువ పబ్లిసిటీ దక్కుతుందనే ఉద్దేశ్యంతో ఆ అమ్మాయి సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలు పెట్టిందని, అది కాస్త తమిళ మీడియాలో బాగా పబ్లిసిటీ అయ్యింది. తమిళ మీడియాలో వార్తలు రావడంతో తెలుగు మీడియా మిత్రులు అంజలికి చెల్లి లేదు అనే విషయాన్ని మర్చిపోయి కథనాలు అల్లేశారు. కొన్ని సార్లు ఇలాంటి పుకార్లు చిత్రంగా పుడుతాయి. కనీసం 1 శాతం కూడా నిజం లేని ఈ పుకారు దాదాపు వారం రోజుల పాటు తమిళ మరియు తెలుగు మీడియాలో సోషల్‌ మీడియాలో తెగ సర్క్యులేట్‌ అవుతుంది. ఎట్టకేలకు అంజలి స్పందించిన తర్వాత పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది.