మహేష్‌బాబు కెరీర్‌లో ‘స్పైడర్‌’ చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?

Spyder Movie Special Movie In Mahesh Babu Career
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజాగా ‘స్పైడర్‌’ చిత్రంలో నటించాడు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్పైడర్‌ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మహేష్‌బాబు ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. సినీ వర్గాల్లో కూడా ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉంది. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాట కూడా ఈ సినిమా ఒకేసారి విడుదల కాబోతుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించగా, ఎస్‌జే సూర్య విలన్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మహేష్‌బాబుకు చాలా ప్రత్యేకం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు, ఆయన అభిమానులు కూడా అంటున్నారు.

మొదటి సారి మహేష్‌బాబు 100 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో సినిమా చేశాడు. ఈ చిత్రాన్ని ఏకంగా 110 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. హాలీవుడ్‌ రేంజ్‌ యాక్షన్‌ సీన్స్‌ ఈ సినిమాలో ఉంటాయని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. బడ్జెట్‌కు తగ్గట్లుగా ఈ సినిమా చాలా రిచ్‌గా ఉంటుంది. మహేష్‌బాబు కెరీర్‌లోనే ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో పలువురు స్టార్‌ హీరోలు మురుగదాస్‌ దర్శకత్వంలో సినిమా చేయాలని కోరుకుంటారు. కాని దర్శకుడు మురుగదాస్‌ మాత్రం మహేష్‌బాబుతో సినిమా చేయానుకున్నాడు. సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఒక బాండ్‌ కథను మురుగుదాస్‌ తీసుకుని స్పైడర్‌ చిత్రాన్ని చేయడం జరిగింది.

Spyder U/A- 145Min
Decent First Half,
Super Pre-Interval Bang,
Sensational Second Half…
3.25/5 – Super HIT 📽🎬🎯