మా’ కి ఝలక్ ఇచ్చిన మహేష్ బాబు…! 

Mahesh Babu To Reject MAA Offer
మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అసోసియేషన్‌) కి చెందిన నిధులు దుర్వినియోగం అయ్యాయనే వివాదం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ఆ నిధులను దుర్వినియోగం చేశారని అసోసియేషన్ కార్యదర్శి నరేష్ తీవ్ర ఆరోపణలు చేయడం, ప్రభుత్వం తరపున ఒక విచారణ కమిటీ కోరడం మరింత నిప్పు రాజేసినట్టు అయ్యింది. నరేష్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత  మా అసోసియేషన్‌లో రెండు వర్గాలుగా ఏర్పడిన సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి  మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్టు కూడా వార్తలు వచ్చాయి.
naresh-maa-mahesh
ఈ నేపధ్యంలో మరో వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. అదేంటంటే క్రితం సారి చిరంజీవిని తీసుకెళ్ళినట్ట్టే మా అసోసియేషన్‌కి నిధులు సేకరించడం కోసం ఈ అక్టోబర్‌ లో మహేష్ బాబు ముఖ్య అతిథిగా అమెరికాలో మా అసోసియేషన్ మరో ఈవెంట్ ఫిక్స్ చేసింది. అయితే, చిరంజీవి ఈవెంట్ ద్వారా సేకరించిన నిధుల్లో కోటి రూపాయలు గల్లంతయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సూపర్ స్టా్ర్ మహేష్ బాబు తన ఈవెంట్‌ను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. స్వయానా తన అన్నే ఇప్పుడు మరో వర్గం మీద ఆరోపణలు చేస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోని ఆయన అసలు ప్రోగ్రామే క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ దాదాపు ఈ విషయం ఖరారయినట్టే అని ఫిలిం నగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
naresh-maa