సూప‌ర్ స్టార్ కుటుంబం నుంచి మ‌రో వార‌సుడు

Ramesh Babu Son Jayakrishna entry in Tollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ లో వార‌సుల ప్ర‌వేశం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు క్యూక‌డుతున్నారు. ఇప్పుడు… సూప‌ర్ స్టార్ కుటుంబం వంతువ‌చ్చింది. కృష్ణ కుటుంబంలో మూడోత‌రం వార‌సుడి సినీరంగ ప్ర‌వేశానికి స‌ర్వం సిద్ధ‌మ‌యింది. కృష్ణ పెద్ద‌కొడుకు ర‌మేశ్ బాబు కుమారుడు జ‌య‌కృష్ణను హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేసేందుకు ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌య‌కృష్ణ వైజాగ్ లో స‌త్యానంద్ ద‌గ్గ‌ర న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఏడాది జ‌య‌కృష్ణ‌ను ప్రేక్ష‌కుల‌ముందుకు తీసుకురావాల‌ని భావిస్తున్నారు.

కృష్ణ‌, మ‌హేశ్ బాబు వార‌స‌త్వాన్ని జ‌య‌కృష్ణ కొన‌సాగించ‌నున్నాడు.. కృష్ణ హీరోగా కొన‌సాగుతున్న కాలంలోనే ర‌మేశ్ బాబు సినిమాల్లో ప్ర‌వేశించి అనేక సినిమాల్లోహీరోగా చేశాడు. అయితే వ‌రుస ప‌రాజ‌యాలతో ఆయ‌న కెరీర్ సాఫీగా సాగ‌లేదు. ఆ త‌ర్వాత మ‌హేశ్ బాబు…తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగించాడు. ఇప్పుడు జ‌య‌కృష్ణ తాత‌, బాబాయ్ లా టాలీవుడ్ లో రాణించాల‌ని క‌ల‌లు కంటున్నాడు.