AMB లో మహేష్ వాటా అంతేనా…?

Whose Idea For Mahesh Babu Built AMB Cinemas

మహేష్ బాబు సినిమాలోనే కాకుండా వాణిజ్య ప్రకటనల రంగంలో కూడా రాణిస్తున్నాడు. తాజాగా అయన వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఏసియన్ సునీల్, తో కలిసి మహేష్ బాబు, ఏఎంబీ మల్టీ ఫ్లెక్స్ సినిమాస్ ను నిర్మించాడు. హైదరాబాద్ లోని కొండాపూర్ జంక్షన్ సమీపంలో ఎఎంబీ సినిమాస్ ను నిర్మించాడు. ఎఎంబీ సినిమాస్ ను నిన్న గ్రాండ్ గా పూజ కార్యక్రమాలతో సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీదుగా మహేష్ బాబు ఓపన్ చేయించాడు. ఏసియన్ సునీల్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఎఎంబీ సినిమాస్ గురుంచి గత కొంతకాలంగా చర్చ నడుస్తుంది.

amb-cinemas-maheshbabu

సూపర్ స్టార్ మహేష్ బాబు కు దీనిలో అధిక మొత్తం లో వాటా ఉంటుంది అని అందరు అనుకున్నారు కానీ. ఏసియన్ సునీల్ తో పాటు ఇంకో నలుగురు పెద్దలు అధిక మొత్తం లో వాటాను కలిగి ఉన్నారు అంట. మహేష్ బాబు 20 శాతం మాత్రమే వాటా ను కలిగి ఉన్నాడని సిని వర్గాల సమాచారం. ఎఎంబీ కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంతో కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టడంతో 20 శాతం ను వాటాను ఇచ్చారు అంట. కొందరు మాత్రం మహేష్ బాబు కు 20 శాతం వాటాకే ఎందుకు ఒప్పుకుంటాడని అధిక మొత్తంలో వాటా ను కలిగి ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎఎంబీ లో మహేష్ కి రెండు స్క్రీన్స్ సొంతంగా ఉన్నాయని. మరో రెండు స్క్రీన్స్ లో వాటా కలిగి ఉన్నాడు అంటున్నారు. మహేష్ బాబు ఎఎంబీ సినిమాస్ కు పెద్ద ఎత్తునా సినిమా ప్రేక్షకులు, మహేష్ అభిమానులు వస్తున్నారు.