నున్నలో యాసిడ్ దాడి…మరీ ఇంత పగా ?

man attacks his son in law with Acid attack

తనని ప్రేమించని ప్రియురాలి మీద యాసిడ్ దాడి చేసిన వారిని చూశాం మనం ఇప్పటిదాకా అయితే విజయవాడలో జరిగిన ఒక యాసిడ్ దాడి కేసు ఇప్పుడు కలకలం రేపుతోంది. కూతురితో సరిగా ఉండటంలేదని అల్లుడిపై యాసిడ్ పోశాడో మామ. కూతురితో అల్లుడుకి మనస్పర్థలు రావటంతో తరచు గొడవలు పడుతుండేవారు. గొడవ పడ్డ ప్రతి సారి సర్ది చెప్పాల్సి వచ్చేది. దీంతో మోహనచారిపై చిర్రెత్తుకొచ్చిన మామ అతనిపై ఆసిడ్ తో దాడి చేశాడు. ప్రస్తుతం బాధితుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మోహనచారి ఫిర్యాదుతో అతని భార్యతో పాటు అత్తమామలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ శివారులోని వాంబే కాలనీలో చోటు చేసుకుందీ ఘటన.