హైదరాబాద్ ఓటర్ల పై మంచు లక్ష్మి బాగా సీరియస్‌….ఎందుకంటే …..!

Manchu Lakshmi is very serious about Hyderabad voters....because....!
Manchu Lakshmi is very serious about Hyderabad voters....because....!

హైదరాబాద్ ఓటర్ల పై మంచు లక్ష్మి సీరియస్‌ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది . ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ కొనసాగుతుంది . ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఈరోజు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

ఉదయం 9 గంటల వరకు లోక్‌సభకి ఏపీలో 9.05శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే… ఈ తరుణంలోనే…హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి సీరియస్‌ బాగా అయ్యారు. హైదరాబాద్ నగరంలో లో ఇప్పటివరకు 5 శాతమే ఓట్లు నమోదు కావడం సిగ్గుచేటు అని అన్నారు. FNCC లో ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత మీడియా తో మంచు లక్ష్మి మాట్లాడుతూ… నేను కేవలం ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ముంబాయి నుంచి హైదరాబాద్ కి వచ్చాను కానీ హైదరాబాద్ లో ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం బయటికి రాకపోవడం చాలా దారుణం అని అన్నారు. నగర ప్రజలు బయటికి వచ్చి ఓటు వేయాలని ఆమె కోరారు.