కరోనా ఎడబాటు. మంచు విష్ణు భావోద్వేగం.

ప్రపంచమంతా కరోనాతో అల్లల్లాడిపోతుంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను కరోనా వైరస్ వేధిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. అలాగే… అమెరికాలో కూడా కరోనా విలయ తాండవం చేస్తుంది.
కరోనాను కట్టడి చేసేందుకు భారత్ మొత్తం లాక్ డౌన్ తో యుద్ధం చేస్తోంది. ఆ వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రస్తుతమున్న ఏకైక మందు ఎవరి ఇంట్లో వాళ్లు ఉండటం. ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేని ఈ వైరస్ భూతాన్ని అరికట్టాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గం. అలాగే లాక్‌డౌన్. దీంతో అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి. ఇదిలాఉండగా.. అగ్రరాజ్యమైన అమెరికా కుడా కరోనా దెబ్బకు కుదేలైపోతుంది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగుతుంది.
ఈ నేపథ్యంలో మంచు విష్ణు చేసిన పోస్ట్ తాజాగా ఆందోళన కలిగిస్తుంది. మంచువిష్ణు సతీమణి ఆయన పిల్లలు అమెరికాలో ఇరుక్కుపోయారు. భారత్ లాక్ డౌన్ కారణంగా తన భార్య, పిల్లలు అమెరికాలో ఇరుక్కుపోయారని విష్ణు ఆవేదనకు లోనయ్యారు. ఫిబ్రవరి నెలాఖర్లో తమ బంధువుల్లో ఒకరికి సర్జరీ ఉండటంతో తన భార్య పిల్లలు అమెరికా వెళ్లారని తిరిగి వద్దామనుకునే సమయంలో విమానాలు ఆపేశారని వారిని చాలా మిస్ అవుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు విష్ణు. కానీ మన భవిష్యత్తుకోసం లాక్ డౌన్ తప్పదని అందరు ఇళ్లలోనే ఉండాలని మంచు విష్ణు  కోరారు.

 

View this post on Instagram

 

#StayHome #StaySafe

A post shared by Vishnu Manchu (@vishnumanchu) on