నానితో మహేష్‌ సోదరి చిత్రం

manjula ghattamaneni to Produce Nani Next Film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సోదరి మంజుల నిర్మాతగా ఇప్పటి వరకు పలు చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం సుందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌ జంటగా ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. మొదటి సారి మంజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవలే విడుదలైన టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. ఇక మంజుల తన తదుపరి చిత్రాన్ని నానితో చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే నానితో ఒక చిత్రం కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అవ్వడంతో నాని వెంటనే ఆమెకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.

‘మనసుకు నచ్చింది’ చిత్రాన్ని వేరే బ్యానర్‌లో చేస్తోన్న మంజు తన తదుపరి చిత్రాన్ని మాత్రం తన సొంత బ్యానర్‌ అయిన ఇందిర ప్రొడక్షన్స్‌లోనే చేయాలని నిర్ణయించుకుంది. అందుకే స్వయంగా నానితో మంజుల ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే నానితో తన బ్యానర్‌లలో స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించబోతుందా లేక మరో దర్శకుడితో నాని చిత్రాన్ని నిర్మిస్తుందా అనే చర్చ జరుగుతుంది.

నాని కోసం మంజుల ఒక కథ సిద్దం చేశారని, ఆ కథకు నాని ఓకే చెప్పడం జరిగిందని, స్వీయ దర్శకత్వంలో నాని హీరోగా మంజుల ఒక చిత్రాన్ని నిర్మించబోతుంది అంటూ కొందరు సినీ పరిశ్రమకు చెందిన వారు చెబుతున్నారు. అయితే ఆ వార్తల్లో నిజం ఎంత వరకు ఉందనే విషయం తెలియాల్సి ఉంది. వరుస విజయాలతో దూసుకు పోతున్న నాని మంజుల దర్శకత్వంలో సినిమా చేస్తాడా అనేది అనుమానమే. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం నాని ‘ఎంసీఏ’ చిత్రంతో రెడీ అవుతున్నాడు. మరో వైపు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని మరియు నాగార్జునతో కలిసి ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు