నరాలు తెగేలా ఉత్కంఠ

march 30th Rangasthalam movie release in fans happy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రామ్‌ చరణ్‌, సమంత జంటగా పూర్తి పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. ఇటీవల కాలంలో స్టార్‌ హీరోల చిత్రాలు పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక 1980ల కాలం నేపథ్యంలో తెరకెక్కడం మరో హైలైట్‌. సుకుమార్‌ దర్శకత్వంలో ఇలాంటి విభిన్న చిత్రం తెరకెక్కడం మరింత హైలైట్‌. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి తాజాగా రంగ రంగ రంగస్థలాన పాట మేకింగ్‌ వీడియో విడుదల అయ్యే వరకు సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ మరియు టీజర్‌లు విడుదల అవుతుంటే తేలిపోయింది. ఇలాంటి సినిమాలు తీయడంలో సుకుమార్‌ అద్బుతమైన పనితనం కనబర్చుతాడనే నమ్మకంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఒక స్టార్‌ హీరో చెవులు వినిపించని పాత్రలో నటించడం అంటే మామూలు విషయం కాదు. తెలుగులో ఇలాంటి పాత్రలు అస్సలు స్టార్‌ హీరోల వద్దకే వెళ్లవు. కాని ఛాలెంజింగ్‌ పాత్రలను ఎప్పుడు స్వీకరించే రామ్‌ చరణ్‌ ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రలో చెవులు వినిపించని వ్యక్తిగా కనిపించబోతున్నాడు. పూర్తి స్థాయి మాస్‌ మసాలా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత గ్లామర్‌ మరో హైలైట్‌గా నిలుస్తుందని ఇప్పటికే విడుదలైన పాటు, టీజర్‌లను బట్టి తెలుస్తోంది. మొత్తానికి రంగస్థలం సినిమా ఈనెల 30న విడుదల కాబోతున్న నేపథ్యంలో నరాలు తెగేలా ఉత్కంఠ వాతావరణం ప్యాన్స్‌లో నెలకొంది. 150 కోట్ల కలెక్షన్స్‌ సునాయాసంగా రాబడుతుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.