తమన్‌ కాకుండా మరొకరు!!

Sye Raa Narasimha Reddy Music Director as Amit Trivedi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ రెండవ షెడ్యూల్‌ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ముఖ్యమైన నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి మొదట ఏఆర్‌రహమాన్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నాడు. అప్పటి నుండి కూడా పలువురి పేర్లు ఈ చిత్రం సంగీత దర్శకులు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ఫైనల్‌ కాలేదు. నిన్న మొన్నటి వరకు తమన్‌ పేరు ఎక్కువగా వినిపించింది, అంతకు ముందు కీరవాణి పేరు ప్రస్థావనకు వచ్చింది. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేదిని కూడా సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సైరా చిత్రాన్ని కేవలం సౌత్‌ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా టార్గెట్‌ చేసి తెరకెక్కిస్తున్న సినిమా. అందుకే ఈ చిత్రంకు బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అయితే హిందీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవచ్చు అనే ఆలోచనలో చిత్ర యూనిట్‌ సభ్యులున్నారు. రహమాన్‌ను మరోసారి సంప్రదించే యోచనలో కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. మొత్తానికి సైరా చిత్రం సంగీత దర్శకుడు ఎవరై ఉంటారా అంటూ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక వైపు చిత్రీకరణ చకచక జరుగుతున్న నేపథ్యంలో సంగీత దర్శకుడిని ఎంపిక చేయడంలో చిత్ర యూనిట్‌ సభ్యులు హడావుడి చేస్తున్నారు. థమన్‌, అమిత్‌, కీరవాణి ఇలా పలువురిలో ఎవరు ఫైనల్‌ అవుతారో చూడాలి.