మళ్లీ బిత్తిరి సత్తిని వాడేస్తున్నాడు

Bittiri Satti in Venkatesh and Teja Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
వి6 తీన్మార్‌ వార్తలతో బిత్తిరి సత్తి ఎంత ఫేమస్‌ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిత్తిరి సత్తి అలియాస్‌ రవి చేవెళ్లకు సినిమాల్లో కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో బిత్తిరి సత్తి ముఖ్యమైన పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. స్క్రీన్‌ప్లే సీరియస్‌గా సాగుతున్న సమయంలో బిత్తిరి సత్తి కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. దాంతో తేజ తన తర్వాత సినిమాలో కూడా బిత్తిరి సత్తిని కీలక పాత్రకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కాలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే.

కాలేజ్‌లో లెక్చరర్‌గా వెంకటేష్‌ కనిపించబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇక ఈ చిత్రంలో బిత్తిరి సత్తి కాలేజ్‌లో ఆపీస్‌ ఫ్యూన్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. స్టూడెంట్స్‌కు మరియు లెక్చరర్స్‌కు మద్య వారధిగా బిత్తిరోడు ఉండి కామెడీ పండిస్తాడు అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. తన సహజమైన యాసతోనే బిత్తిరి సత్తి ఈ చిత్రంలో కామెడీ చేయబోతున్నాడు. ఈనెల 26 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను జరుపబోతున్నారు. వెంకటేష్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని, గతంలో వెంకీ ఎప్పుడు చేయని పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నట్లుగా దర్శకుడు తేజ చెబుతున్నాడు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో దర్శకుడిగా ఫామ్‌లోకి వచ్చిన తేజ మరోసారి సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.