క్రియేటివ్‌ డైరెక్టర్‌ వలలో పడ్డాడు

Rana Daggubati's Next Film with Krishna Vamsi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ గత కొంత కాలంగా క్రియేటివిటీకి దూరంగా సినిమాలు చేస్తున్న కారణంగా వరుసగా ఫ్లాప్‌ అవుతూ వచ్చాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘నక్షత్రం’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో మరో సినిమా కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. పలువురు స్టార్‌ హీరోలను సంప్రదించిన కృష్ణవంశీ ఎట్టకేలకు రానాను ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేసుకుంటూ ఫుల్‌ బిజీగా గడిపేస్తున్న రానా ఒక మంచి స్టోరీ లైన్‌ చెప్పడంతో కృష్ణవంశీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ప్రయోగాలను చేసేందుకు ఎప్పుడు ముందు ఉండే రానా ఈసారి కృష్ణవంశీతో ప్రయోగం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

రామ్‌ చరణ్‌తో తెరకెక్కించిన ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం కాస్త పర్వాలేదు అనిపించినా కూడా ఆ క్రెడిట్‌ కూడా కృష్ణవంశీకి దక్కలేదు. ఆ తర్వాత చేసిన చిత్రాలు ఏవీ కూడా కృష్ణవంశీలోని పూర్తి స్థాయి దర్శకుడిని వెలికి తీసుకు రాలేక పోయాయి. కృష్ణవంశీ నుండి ఒక గొప్ప చిత్రం వస్తుందని ఇప్పటికి కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఆ నమ్మకంతోనే రానా కూడా ఆయన దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని, ఒక నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు అంటూ సమాచారం అందుతుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.