నాగబాబుని క్షమించాలాట…!

Mega Brother Naga Babu Says Sorry To Bhatraju Community

ఈ మధ్య కాలంతో మెగా బ్రదర్ నాగబాబు అతిగా ఆవేశపడుతూ సినిమా ఇండస్ట్రీ పెద్దలపైన (మెగా ఫ్యామిలీ మినహా), రాజకీయ నాయకులపైన (పవన్ కళ్యాణ్ మినహా) అంతా నా ఇష్టం అంటూ సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తాళ జ్ఞానికి ప్రేమతో పేరులో ఏబీఎన్ రాధాక్రిష్ణ‌ లోకేష్ బాబుని, చంద్రబాబుకి ఎలా భజన చేస్తున్నారో చూడండి అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఏబీఎన్ ఛానల్‌కి సంబంధించిన ఒక వీడియోను ఉపయోగించడంతో వాటిని సదరు ఛానల్ యూట్యూబ్ నుండి డిలీట్ చేసేలా చర్యలు చేపట్టింది. దీంతో ఆగ్రహించిన నాగబాబు ఏబీఎన్‌పైన ఆ ఛానల్ అధినేత రాధాక్రిష్ణపైన ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ మళ్లీ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను కూడా డిలీట్ చేశారనుకోండి.

అందులో రాధాక్రిష్ణని టార్గెట్ చేస్తూ మాట్లాడితే పత్రికా స్వేచ్ఛను హరించకూడదని మీరే చెప్తారు. మా స్వేచ్ఛను మీరు హరించేయవచ్చా మీరు ఏం తిట్టినా కూడా భరించాలా? మీ మీద ఓ జోక్ వేసినా తట్టుకోలేరా? మీరు చేసిన ‘భట్రాజ్’ పొగడ్తల్ని నేను చూపించా. మీరు ఆ వీడియోని ఆపుతారు కాని నన్ను ఎక్కడ ఆపుతారని అంటూ ఏబీఎన్ రాధాక్రిష్ణపై ఫైర్ అవుతూ వీడియో విడుదల చేశారు. అయితే ఇందులో ‘భట్రాజ్ పొగడ్తలు’ అనే పదాన్ని ఉపయోగించడంతో ఆ కమ్యునిటీ మనోభావాలు దెబ్బతినకుండా దిద్దుబాటు చర్యల్ని చేపడుతూ అసలు ఆ సంఘం ఒకటి ఉన్నదని నాకు తెలియదు అందుకే పొరపాటున నా నోటి నుండి ఆ పదం వచ్చేసింది క్షమించాలని కోరుతూ ఫేస్ బుక్‌ ద్వారా క్షమాపణలు కోరుతున్నారు నాగబాబు. అయితే నాగబాబు వ్యాఖ్యలకి ఈ మధ్య హద్దు అనేది ఉండట్లేదు అనేది గమనించాల్సిన విషయ. తాము మాత్రమే అత్యంత పవిత్రులు అన్నట్టు ఆయన చేస్తున్న వీడియోస్ తెగ ట్రోలింగ్ కి గురవుతున్నాయి.