త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగాస్టార్…?

Megastar Chiranjeevi Green Signal To Trivikram Story

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మెగా స్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహ‌రెడ్డి చిత్రం లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో న‌య‌న‌తార మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి న‌టిస్తుంది. ఆ త‌ర్వాత కొర‌టాల శివ‌తో ఓ సినిమాలో న‌టిస్తాడు అన్న‌ సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌ మ‌రే చిత్రం చేయ్య‌కుండా చిరంజీవి కోసం స్ర్కీప్ట్ వ‌ర్క్ ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం జ‌న‌వ‌రి నుండి రెగ్యూల‌ర్ గా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ నేప‌థ్యంలోనే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీను చిరంజీవిని క‌లిసి ఓ క‌థ‌ను వినిపించాడు అంట దీనికి చిరు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. ప్రేక్ష‌కులు ఏమి అశిస్తారో అవి అన్ని క‌ల‌గ‌లిసిన ఓ క‌థ‌ను మెగాస్టార్ కోసం సిధ్దం చేశాడంట.

Megastar-Chiranjeevi

కొర‌టాల శివ‌తో సినిమా పూర్తి అయినా వెంట‌నే చిరంజీవ‌తో త్రివిక్ర‌మ్ శ్రీనువాస్ ఆ చిత్రంను తెర‌కెక్కించనున్నాడు. ఆ చిత్రంను ప్ర‌ముఖ నిర్మాత డివివి దాన‌య్య త‌న బ్యాన‌ర్ లో నిర్మించాలని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో ఓ సినిమాను రూపొందించ‌నున్నాడు. మెగాస్టార్ తో త్రివిక్ర‌మ్ సినిమా పూర్తైనా త‌ర్వాత బోయపాటి చిరుతో ఓ చిత్రంను తెర‌కెక్కించాలని అనుకున్న‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రంను రామ్ చ‌ర‌ణ్ నిర్మించనున్నాడు. త్వ‌ర‌లోనే చిరంజీవి బోయ‌పాటిల సినిమా గురించి పూర్తి వివరాలు ప్ర‌క‌టించ‌నున్నారు. వ‌రుస‌గా విరామం లేకుండా సినిమాలు చేస్తున్నా చిరంజీవి కుర్ర హీరోల‌తో పోటి ప‌డుతున్నాడు.

cheranjeevi