పోటీని భరించలేక తప్పుకున్న ‘యాత్ర’…!

Yatra Movie Director Mahi V Raghav Comments On Biopic Movies

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘యాత్ర’ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముటి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో పలువురు సినీ ప్రముఖులు నటిస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించారు. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంను డిసెంబర్‌ బరి నుండి తప్పించినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్‌లో యంగ్‌ హీరోలు పలువురు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో యాత్రను విడుదల చేయడం వల్ల ఆత్మహత్య సదృశ్యం అన్నట్లే అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు.

ANASUYA

యాత్ర చిత్రంను డిసెంబర్‌ లో కాకుండా జనవరిలో విడుదల చేయాలని దర్శకుడు మహి వి రాఘవ్‌ భావిస్తున్నాడట. జనవరిలో సంక్రాంతి సీజన్‌లో పలు చిత్రాలు రాబోతున్నాయి. కనుక ఆ చిత్రాలతో పోటీ పడకుండా రిపబ్లిక్‌ డే కాని, ఆ తర్వాత వారం కాని సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ రిపబ్లిక్‌ డేకు విడుదల కాబోతున్న నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రం విషయంలో దర్శకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అంటూ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని కొందరు కోరుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. త్వరలోనే అధికారిక విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Yatra-Movie-Release-Details