అక్షర సినిమా టీజర్ – నందితా శ్వేతా నుండి మరో థ్రిల్లర్

Nandita-Swetha-Akshara-Movi

ఎక్కడికి పోతావు చిన్నవాడా తో తెలుగు ప్రేక్షకులు నచ్చేలా భయపెట్టిన నందితా శ్వేతా ముఖ్యపాత్రలో ‘అక్షర’ అనే ఒక కొత్త లేడీ ఓరియెంటెడ్ సినిమా రాబోతుంది. మెడికల్ కళాశాలలలో జరిగే వాస్తవిక సంఘటనలను ఆధారంగా చేసుకొని, థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని డైరెక్టర్ చిన్నికృష్ణ రూపొందిస్తున్నాడు. సినిమాకి సంగీతం సురేష్ బొబ్బిలి (అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్) అందిస్తుండగా, సినిమాహాల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది. టీజర్ ప్రారంభంలో ఒక మెడికల్ స్టూడెంట్ కళాశాల భవనం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకునే సన్నివేశం తో మొదలవ్వగా, నందితా శ్వేతా మెడికల్ కళాశాల ప్రొఫెసర్ పాత్రలో ఎంట్రన్స్ ఇస్తుంది. ఆమె తెచ్చుకున్న పుస్తకం లో రక్తం తో తడిసిన ఒక కత్తి ని చూపెట్టగా, ఎక్కడికి పోతావు చిన్నవాడా లో కనిపించిన లుక్ లో మరోసారి కనిపించి ఆకట్టుకుంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు ప్రకటించిన ఈ చిత్రం షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుంది. ఇది కాకుండా, నందితా శ్వేతా హీరోయిన్ గా నటిస్తున్న బ్లఫ్ మాస్టర్ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.