యాత్ర మూవీ కొత్త రిలీజ్ డేట్…!

Yatra Movie Release Details Revealed

రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యం గా ఏలి, మధ్యలోనే హెలికాప్టర్ దుర్ఘటనలో అమరుడైన వై. యస్. రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ యాత్ర ‘. ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా కొనసాగుతూ ముగింపు దశలో ఉంది. అంతేకాకుండా పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ కూడా ముగించుకొని, డిసెంబర్ 21 న వై. యస్ . జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భమును పునస్కరించుకొని విడుదలకు సిద్ధం కూడా అవుతుంది. కానీ, తెలియని కారణాల వలన ఈ సినిమా విడుదల వాయిదా పడబోతోంది. దీని ప్రకారం, యాత్ర సినిమా జనవరి నెల చివరి వారంలో, బహుశా రిపబ్లిక్ డే రోజున విడుదల అవ్వొచ్చని సమాచారం.

Yatra-Movie-Release-Details

ఈ యాత్ర సినిమాలో వై. యస్. రాజశేఖర రెడ్డి గా మలయాళ ప్రముఖ నటుడు మమ్మూట్టి నటిస్తున్నారు. యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర లో నటిస్తుండగా, ఆ పాత్ర వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. బహుశా, అనసూయ వై. యస్. షర్మిల పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తుంది.ఈ సినిమాలో జగపతిబాబు వై. యస్. రాజా రెడ్డి పాత్రలో నటిస్తుండగా, వై. యస్. జగన్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు. సీనియర్ నటి సుహాసిని సబితా ఇంద్రారెడ్డి పాత్ర ని పోషిస్తుంది. వీరే కాకుండా, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, వినోద్ కుమార్, సచిన్ ఖేద్కర్ వంటి నటులు కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ప్రొడ్యూసర్ నుండి దర్శకుడిగా మారి, ఆనందో బ్రహ్మ అనే విజయవంతమైన సినిమాని రూపొందించిన మహి. వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ANASUYA