ఉన్నమాట చెప్పిన నాని.. మెగా, నందమూరి ఫ్యాన్స్‌ సీరియస్‌

megha fans and nandamuri fans series on nani at bhagmati movie pre release event

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యి మూడు వారాలు అవుతుంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కు ఒక్క సక్సెస్‌ కూడా దక్కలేదు. జస్ట్‌ యావరేజ్‌ చిత్రం కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. దాంతో సినీ వర్గాల వారు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. ఇదే సమయంలో ఈ వారం రిపబ్లిక్‌ డే సందర్బంగా పలు చిత్రాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒకటి ‘భాగమతి’. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘భాగమతి’ చిత్రం ఆడియో వేడుక తాజాగా జరిగింది. ఆ వేడుకలో నాని మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇంకా సక్సెస్‌ రాలేదని, అది ‘భాగమతి’తో ప్రారంభం అవ్వాలని కోరుకుంటున్నట్లుగా నాని చెప్పుకొచ్చాడు. నాని డైరెక్ట్‌గానే బాలయ్య, పవన్‌ సినిమాలు ఫ్లాప్‌ అంటూ తేల్చి పారేశాడు. ఇప్పుడు నాని వ్యాఖ్యలపై విమర్శలు మొదలవుతున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రం దాదాపు 75 కోట్లు వసూళ్లు చేసిందని పవన్‌ ఫ్యాన్స్‌, బాలకృష్ణ కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించి నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టింది అంటూ ‘జైసింహా’ గురించి నందమూరి ఫ్యాన్స్‌ చెబుతున్నారు. నానికి ఈ కలెక్షన్స్‌ కనిపించడం లేదా, సినిమా సక్సెస్‌ అంటే నాని పరిభాషలో ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మెగా మరియు నందమూరి ఫ్యాన్స్‌కు ఆగ్రహంను తెప్పించాయి. అయితే నాని చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందని, పవన్‌ అజ్ఞాతవాసి 150 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉండగా 75 కోట్లు వసూళ్లు చేస్తే సక్సెస్‌ ఎలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక నాని ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘శ్రీకృష్ణ అర్జున యుద్దం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.