రానా మూవీలో మెగా హీరో

megha hero Varun Tej in Rana daggubati movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా హీరోలు ఇతర హీరోల సినిమాల్లో కనిపించడం చాలా చాలా అరుదు. ఇటీవల ఏ మెగా హీరో కూడా ఇతర హీరోల సినిమాల్లో కనిపించింది లేదు. చిరంజీవి కొన్నాళ్ల క్రితం ఒకటి రెండు సినిమాల్లో నటించాడు. ఒక మెగా హీరో సినిమాలో మరో మెగా హీరో కనిపించడం కామన్‌. కాని ఇతర హీరోల సినిమాల్లో మెగా హీరోలు కనిపించడం అది కూడా గెస్ట్‌ పాత్రలో అవ్వడం చాలా అరుదు. తాజాగా ఆ అరుదైన సంఘటన జరగబోతుంది. రానా హీరోగా తెరకెక్కుతున్న ‘అడవి రాముడు’ చిత్రంలో రానాతో పాటు మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కనిపించబోతున్నాడు.

rana-daggubati-and-varun-te

విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న రానా ‘అడవి రాముడు’ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు మరింత క్రేజ్‌ను పెంచేందుకు ఈ చిత్రంలో మెగా హీరోతో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇప్పించాలని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు. మెగా ఫ్యామిలీకి రానా అత్యంత సన్నిహితుడు. రామ్‌ చరణ్‌ మరియు రానాలు చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

varun tej guest role in rana daggubati adavi ramudu movie

మెగా హీరోలందరితో కూడా రానా చాలా క్లోజ్‌గా ఉంటాడు. అందుకే రానా చిత్రంలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చేందుకు వరుణ్‌ తేజ్‌ ఓకే చెప్పాడు. ‘అడవి రాముడు’ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ పాత్ర హైలైట్‌ అవుతుందని, తప్పకుండా సినిమాకు మెగా అప్పియరెన్స్‌ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాల వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కానుకగా రానా అడవి రాముడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెళ్లడి కావాల్సి ఉంది.