అజ్ఞాతవాసి మీద కాపీ ఎటాక్…తెలుగులో ఇప్పుడే మొదలైందా?

agnathavasi Movie Copy To french movie Largo Winch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

“అజ్ఞాతవాసి” విడుదల రోజు దగ్గరపడేకొద్దీ ఆ సినిమా మీద కాపీ అన్న దాడి ఉధృతమైంది. 2008 లో వచ్చిన ఓ ఫ్రెంచ్ మూవీ “ ది హెయిర్ అప్పా రెంట్ ; లార్గో వించ్ “ అనే సినిమాకు అజ్ఞాతవాసి కాపీ అని సోషల్ మీడియాలో మాములుగా ప్రచారం జరగలేదు. పవన్ మీద అలుపెరగని పోరాటం చేస్తున్న కత్తి మహేష్ కూడా ఈ ప్రచారానికి తన వంతు సాయం చేసాడు. మొత్తానికి ఈ ప్రచారం ఎక్కడ దాకా వెళ్లిందంటే 9 ఏళ్ల కిందట ఆ ఫ్రెంచ్ సినిమా తీసిన దర్శకుడు జెరోం సల్లే దాకా పోయింది. కాదు కాదు …కావాలని అక్కడ దాకా తీసుకెళ్లారు. దీంతో ఆయన కూడా ట్విట్టర్ ద్వారా అజ్ఞాతవాసి చూడడానికి ముందు విమానం, ఆ తర్వాత సినిమా టికెట్ కొనాలి అనుకుంటున్నట్టు చెప్పారు. ఒకవేళ జెరోం రాకపోతే ఫ్రాన్స్ దాకా వెళ్లి ఆయన్ని తీసుకొచ్చి అజ్ఞాతవాసి చూపించి నా సినిమాని కాపీ కొట్టారని స్టేట్ మెంట్ ఇచ్చేదాకా వదిలేట్టు లేరు.

ఇప్పుడు అజ్ఞాతవాసి మీద కాపీ అని ఎటాక్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. వీళ్ళ హడావిడి ఏ రేంజ్ లో ఉందంటే తెలుగు సినిమాల్లో ఇప్పటిదాకా ఎక్కడా కాపీ కంటెంట్ లేనట్టు ,ఇప్పుడే అజ్ఞాతవాసి తో ఆ పాపం జరిగిపోయినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారు. ఒక్క తెలుగు ఏమిటి అసలు భారతీయ చలనచిత్ర రంగంలోనే ఇలా పరదేశ సినిమాల స్ఫూర్తి ( కాపీ అని కొందరు అంటారు ) తో లెక్కకు మించిన సినిమాలు వచ్చాయి. వాటిల్లో  కొన్ని ఆణిముత్యాల జాబితాలో కూడా వున్నాయి. ఇక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో దిగ్గజాలు అనుకునే దర్శకుల సినిమాల్లో ఇలాంటి కాపీ కంటెంట్ వెదకడం చాలా చిన్న పని. అంత మాత్రాన ఏ మాత్రం సృజన లేకుండా కేవలం కాపీ కంటెంట్ తో అందరూ గొప్ప వాళ్ళు అయ్యారని చెప్పడం మా ఉద్దేశం కాదు. కాపీ అనే తప్పు ఇప్పుడు రచ్చ చేస్తున్న వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు అజ్ఞాతవాసి తోనే మొదలు కాలేదు. దీనితోనే ఆగిపోదు. పైగా ఇలాంటి ప్రచారం ఆ సినిమాకు ఇంకాస్త మేలు కూడా చేస్తుందేమో. అత్తారింటికి దారేది టైం లో విడుదలకు ముందే పైరసీ కాపీ వచ్చిందన్న సానుభూతి ఆ సినిమాకి కనకవర్షం కురిపించిన విషయం ఇంకా మన స్మృతిపధం లోనే వుంది కదా.