అడ్వాన్స్ ఇవ్వనంటూ హీరోయిన్ పేచీ…!

Mehreen-Has-To-Return-Advan

కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన మేహ్రిన్ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కానీ మేహ్రిన్ కు సారైనా విజయం ను మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలే ఉన్నాయి. కుర్ర హిరోస్ పోటిపడి మరి మేహ్రిన్ ను తీసుకుంటున్నారు. ప్రస్తుతం మేహ్రిన్ వరుణ్ తేజ్ సరసన ఎఫ్2 అనే చిత్రంలో నటిస్తుంది. మేహ్రిన్ పై ఈ మద్య నిర్మాత మండలి నుండి ఓ వివాదం ఎదురైంది. అది ఏమిటి అంటే… ఓ బడ నిర్మాత సుధీర్ బాబు హీరో గా.. మేహ్రిన్ హీరొయిన్ గా ఓ సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశాడు అందకు మేహ్రిన్ కు అడ్వాన్సు అమౌంట్ కూడా ఇచ్చాడు ఆమె డేట్స్ కూడా తీసుకున్నాడు. ఎందుకో ఏమో ఆ చిత్రం నుండి సుధీర్ బాబు తప్పుకున్నాడు.

సుధీర్ బాబు తప్పుకోవడంతో మరో హీరో కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు సినిమా సెట్స్ పైకి వెళ్ళడం ఆలస్యం అవ్వుతుందని భావించి మేహ్రిన్ ను అడ్వాన్సు తిరిగి ఇవ్వాలని ఆ నిర్మాత కోరాడు అందుకు మేహ్రిన్ నేను ఇవ్వను అని తేల్చి చెప్పింది. ఆ నిర్మాత నిర్మాత మండలిలో మేహ్రిన్ పైన కంప్లైంట్ కూడా ఇచ్చాడు. మేహ్రిన్ నిర్మాత మండలి ముందుకు వచ్చి తన వాదనను వినిపించింది. నేను అడ్వాన్సు ఇవ్వలేను, ఎందుకంటే నా డేట్స్ ఇస్తే వాటిని మొత్తం దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు నా డేట్స్ కి ఎవ్వరు రెస్పాన్సు అంటూ గట్టి వాదనను వినిపించింది. కానీ నిర్మాత మాత్రం నా అడ్వాన్సు అమౌంట్ వెనక్కి ఇవ్వాలిసిందే అంటూ గట్టిగా వాదిస్తున్నాడు. ఇక నిర్మాత మండలి ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి