311 భారతీయులను వెనక్కి పంపిన మెక్సికో

311 భారతీయులను వెనక్కి పంపిన మెక్సికో

311 మంది భారతీయులను మెక్సికో అధికారులు తిరిగి స్వదేశానికి పంపించేశారు. సరైన అనుమతులు లేని భారతీయులను టొలుకా విమానాశ్రయం నుండి ప్రత్యేక బోయింగ్‌ 747 విమానంలో భారత్‌కు వెనక్కి పంపినట్లు సమాచారం. ఐఎన్‌ఎమ్‌ మెక్సికన్‌ జాతీయ వలసల సంస్థ ఓ ప్రకటన ద్వారా ఈ సమాచారాన్ని అందించింది.

సరిహద్దుల వెంబడి నిఘా పెంచడం వల్ల వలస దారులను తమ దేశంలోకి అనుమతించే పాలసీని మార్చాలని మెక్సికో ఐఎన్‌ఎమ్‌ పాలసీలలో మార్పులు తేవాలని నిర్ణయించుకుంది. భారతీయ దౌత్య కార్యాలయం నుండి తప్పుడు దారిలో వచ్చే అక్రమ వలస దారులను వెనక్కి పంపించే ప్రయత్నంలో అందించిన సహకారనికి కృతజ్ఞతలు తెలిపింది.