షారుక్ కి లాభం… విజయ్ కి నష్టం

షారుక్ కి లాభం... విజయ్ కి నష్టం

ఇండియాలో తమ హీరో సినిమా టీజరో, ట్రైలరో వస్తోందంటే.. పదుల సంఖ్యలో ఒక గదిలో కంప్యూటర్లు పెట్టుుకుని వేర్వేరు అకౌంట్ల నుంచి లైక్స్ కొట్టడం, వ్యూస్ పెంచడం.. గంటకు ఇన్ని, రోజుకు ఇన్ని అని వ్యూస్, లైక్స్ టార్గెట్ పెట్టుకుని వాటిని పూర్తి చేయడం.. యూట్యూబ్‌లో అవతలి హీరో రికార్డును కొట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించడం ,సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ బాగా ఊపందుకునేలా చేసిన ఘనత తమిళ స్టార్లు విజయ్, అజిత్‌ల అభిమానుల నుంచే మొదలైంది.

యూట్యూబ్‌ వ్యూస్, లైక్స్ విషయంలో ఈ దురభిమానుల అతి ఎంత వరకు చేరిందో చెప్పడానికి ఇప్పుడో తాజా ఉదాహరణ దొరికింది. అభిమానం వెర్రితలలు వేస్తే.. అవతలి హీరో మీద ద్వేషం తీవ్ర స్థాయికి చేరితే ఏమవుతుందో అజిత్ అభిమానులు రుజువు చేశారు. తాజాగా విజయ్ సినిమా ‘బిగిల్’ ట్రైలర్ రిలీజైంది. ఎప్పట్లాగే విజయ్ అభిమానులు పంతం పట్టి యూట్యూబ్ రికార్డుల అంతు చూసే పనిలో పడ్డారు.

దీంతో ఈ ట్రైలర్‌ లైక్స్ ఏకంగా 2 మిలియన్ మార్కు దిశగా పరుగులు పెట్టాయి. ఐతే 2 మిలియన్ లైక్స్ సాధించిన తొలి ట్రైలర్‌ రికార్డు విజయ్ సినిమాకు దక్కబోతోందనే వార్తను అజిత్ అభిమానులు తట్టుకోలేకపోయారు. దీంతో 1.9 మిలియన్ లైక్స్‌తో ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న షారుఖ్ సినిమా ‘జీరో’ ట్రైలర్ మీద పడ్డారు. దానికి లైక్స్ పెంచే పనిలో పడ్డారు.1.9 మిలియన్ దగ్గర ఆగిపోయిన దాని లైక్స్.. కొన్ని గంటల్లో 2 మిలియన్ మార్కును టచ్ చేశాయి. దీంతో ఇండియాలో 2 మిలియన్ లైక్స్ మార్కును టచ్ చేసిన తొలి ట్రైలర్‌గా అదే రికార్డుల్లోకెక్కింది.