సిద్ధూ తొలిసారిగా సోనియమ్మతో…

సిద్ధూ తొలిసారిగా సోనియమ్మతో...

రానున్న 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముందు ఉండాలని పార్టీ అద్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ సిద్ధ రామయ్యకి సూచించారు.అధిష్టానం కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత సిద్ధరామయ్యని ఢిల్లీకి పిలిచి టికెట్ల కేటాయింపులో కూడా ఆదిపత్యం సిద్ధ రామయ్యదే అని తేల్చి చెప్పేసింది. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత తొలి సారిగా సిద్ధరామయ్య పార్టీ నాయకురాలితో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు.

సొంత పార్టీ నేతలే సిద్ధరామయ్య వైఖరి వల్ల తమ పార్టీలో వేరే నేతలు బయటికి వెళ్తున్నారని వాపోతున్నారు. రాజ్యసభ సభ్యుడు కేసీ రామ్మూర్తి ఇంకా మాజీ ఎమ్మెల్యే అనిల్‌ లాడ్‌ సిద్ధరామయ్య వల్లే పార్టీ మారుతున్నట్లు మీడియా ముందు తెలియచేసారు. పార్టీకి రాజీనామా చేసిన నేతలు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు జరుపుతున్నట్టు సమాచారం. ఇందువల్ల ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.