‘డేట్ మారినా 2020లో రావడం మాత్రం ఖాయం’ : ఎస్ ఎస్ రాజమౌళి

'డేట్ మారినా 2020లో రావడం మాత్రం ఖాయం' : ఎస్ ఎస్ రాజమౌళి

ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరగడం చాలా చాలా కష్టం. ఇక రాజమౌళి సినిమాలంటే షూటింగ్ లేటవడం అన్నది మామూలు వ్యవహారం. ‘బాహుబలి’ రెండు భాగాలూ ఎంతెంత ఆలస్యం అయ్యాయో.. ఎలా రిలీజ్ డేట్ మార్చారో గుర్తుండే ఉంటుంది. జక్కన్న కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ప్రెస్ మీట్లో వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ అని పోస్టర్ మీద వేస్తే జనాలకు నమ్మకం కలగలేదు. మీడియా వాళ్లు అప్పటికప్పుడే పక్కాగా ఈ డేట్‌కు వస్తారా.. ఎప్పట్లాగే వాయిదానా అని మొహమాటం లేకుండా రాజమౌళిని అడిగేశారు. అయితే ఆ రోజు జక్కన్న ధీమాగానే కనిపించాడు. పక్కాగా ఆ డేటుకే వస్తామని ఒకసారి చెప్పి.. ఒకవేళ డేట్ మారినా 2020లో రావడం మాత్రం ఖాయం అని చెప్పాడు. దేశవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయడానికి దసరా సెలవులు మంచి టైమింగ్ అవుతుందని భావిస్తున్నారట. వచ్చే దసరాకు బాలీవుడ్ సినిమాలు ఏవైనా షెడ్యూల్ అయ్యాయేమో చూసుకుని ఈ చిత్రాన్ని దసరాకు ఖాయం చేయాలని చూస్తున్నారట.

ప్రస్తుతం షూటింగ్ స్టేటస్‌ను బట్టి చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జులై 30న రావడం అసాధ్యం అనే అంటున్నారు. హీరోగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఇద్దరూ గాయపడి కొన్ని రోజులు షూటింగ్‌కు రాలేదు. ‘సైరా’కు సంబంధించిన కమిట్మెంట్ల వల్ల కూడా చరణ్ కొన్ని రోజులు చిత్రీకరణకు దూరంగా ఉండాల్సి వచ్చింది. వేరే కారణాల వల్లా కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది.  ఈ లెక్కన కనీసం మూడు నెలలు వృథా అయ్యాయని.. ఆ మేరకు సినిమాను వాయిదా వేయక తప్పదని చిత్ర వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. కాబట్టి వచ్చే ఏడాది దసరాకు సినిమాను రిలీజ్ చేసే లక్ష్యంతో కొత్తగా ప్రణాళికలు రచిస్తున్నారని.. దేశవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయడానికి దసరా సెలవులు మంచి టైమింగ్ అవుతుందని భావిస్తున్నారట. వచ్చే దసరాకు బాలీవుడ్ సినిమాలు ఏవైనా షెడ్యూల్ అయ్యాయేమో చూసుకుని ఈ చిత్రాన్ని దసరాకు ఖాయం చేయాలని చూస్తున్నారట.