చంద్రుడి ఫొటోలను పంపిన ఆర్బిటార్‌

చంద్రుడి ఫొటోలను పంపిన ఆర్బిటార్‌

చంద్రుడి పై పరిశోధన కోసం చేసిన రెండవ యాత్రకు ఉపయోగించిన నౌక చంద్రయాన్ 2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్‌ విఫలమైన కూడా ఆర్బిటార్‌ మాత్రం పనిచేస్తోంది. ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్ఎల్విఎమ్కె 3 వాహనం ద్వారా చంద్రయాన్ 2 ప్రవేశ పెట్టారు. చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడానికీ చంద్రయాన్ 2 కార్యక్రమం ఇస్రో తలపెట్టింది.

చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్-2 ల్యాండరు దిగి రోవరు బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ వివిధ పరీక్షలు చేసేందుకు  2019 జూలై 15 న ప్రయోగాన్ని నిలిపివేసి 2019 జూలై 22 న చంద్రయాన్-2 ను భూకక్ష్యలో ప్రవేశపెట్టారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విక్రమ్ ల్యాండర్‌ విఫలమైన కూడా ఆర్బిటార్‌ పనిచేస్తూ చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ఫొటోలను తీసింది. చంద్రుడి ఉపరితలం మీద పడుతున్న సూర్య కాంతి లోని తారతమ్యాలను స్పెక్ట్రో మీటర్‌ ద్వారా గ్రహించింది. వీటి ద్వారా చంద్రుడి పైన నిక్షిప్తమైన మూలకాల స్థాయిని,చంద్రుడి మూల స్థానాన్ని తెలుసుకోవచ్చు.

ఇస్రో ఆర్బిటార్ తీసిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేసింది. చంద్రుడిపై కాంతి పరావర్తనం చెందడం ద్వారా చంద్రుడు మెరుస్తున్నాడు, స్వయం ప్రకాశకుడు కాదు అని కాకపోతే ఒకేవిధంగా కాంతి పరావర్తనం జరగదు అనే విషయాలని తెల్సుకునేందుకు ఇస్రో పంపిన ఆర్బిటర్‌ ఉపయోగపడుతుంది.