రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క..వీడియో వైరల్..?

Will Karu's new strategy work to defeat Sitakka?
Will Karu's new strategy work to defeat Sitakka?

ములుగు ఎమ్మెల్యే సీతక్క రక్షాబంధన్ పురస్కరించుకుని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ‘ ఈ బంధం రాజకీయాలతో పరిచయమైన… రాజకీయాలకే అర్థం కానంత పవిత్రమైన బంధంగా మారింది. నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉంటున్న ప్రతి ఒక్క అన్నదమ్ముళ్లకి రాఖీ పండుగ శుభాకాంక్షలు’ అని సీతక్క ట్వీట్ చేశారు.

ఇది ఇలా ఉండగా…భువనగిరి పార్లమెంట్ సభ్యులు,తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయతకు ప్రతిరూపం రాఖీ పండుగ అని దేశ వ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్న ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.