సోనియా గాంధీతో వైఎస్‌ షర్మిల భేటీ.. పార్టీ విలీనంపై చర్చ !

Sonia Gandhi
Sonia Gandhi

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొన్ని రోజులుగా తీవ్ర సందిగ్ధత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై నిన్న వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లారు .

వ్యక్తిగత పర్యటన పేరుతో ఢిల్లీకి వెళ్లారు షర్మిల. అయితే… కాసేపటి క్రితమే… కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఇంట్లోనే.. ఆమెతో వైఎస్‌ షర్మిల సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో… వైఎస్సార్టీపీ ని కాంగ్రెస్‌లో విలీనంపై చర్చ జరుగున్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. వైఎస్‌ షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.