AI వాయిస్ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే…

AI technology
AI technology

వార్తలను ఏఐ టెక్నాలజీతో అవలీలగా చదివే యాంకర్లను చూశాం.. మాయ ,లీసా పేర్లతో ప్రయోగం చేసి సక్సెస్ అయిన వారిని చూశాం.. రోజురోజుకు టెక్నాలజీ పరంగా వేగంగా మార్పులొస్తున్నాయి. కొందరి ఉద్యోగాలు ఏఐ దెబ్బకు ఊడిపోతూనే ఉన్నాయి.ఊడిపోయాయి.. . ఇదిలా ఉంటే.. ఈ టెక్నాలజీ సాయంతోనే అమాయకులను సైబర్ దొంగలు బురిడీ కొట్టిస్తున్నారు .తమ ఇంట్లో వాళ్లు, సన్నిహితులు మాట్లాడినట్టు వాయిస్ సెట్ చేసి.. సోషల్ మీడియాలో ఫొటోలు మార్ఫింగ్ చేసి, వీడియోలుగా రూపొందించి అకౌంట్లలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఏఐ వాయిస్ ద్వారా జరిగే మోసాలు ఎలా గుర్తించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

ఉదాహరణకు ఓ వ్యక్తి తన స్నేహితుడికి లైవ్ వీడియో కాల్ చేసి.. తమ ఫ్యామిలీ ప్రాబ్లమ్‌లో ఉందని, హాస్పిటల్‌లో ఉన్నామని అర్జెంటుగా రూ.20 వేలు ఫోన్‌పే లేదా గూగుల్ పే చేయమంటారు. అయ్యో స్నేహితుడు ఆపదలో ఉన్నాడని డబ్బులు పంపుతా అంటారు. సరిగ్గా అదే సమయానికి తన నెంబర్ కాకుండా.. వేరే నెంబర్ చెబుతున్నారు. అదేంటి అంటే ఇది ఇంకో నెంబర్.. బ్యాంకు అకౌంట్‌కు ఇదే లింక్ అయ్యిందని చెప్తారు. ఆ ఒక్క మాట నమ్మి మీరు డబ్బులేస్తే అంతే సంగతులు. ఎందుకంటే అది మీకు తెలిసిన వారు కాదు. సైబర్ నేరగాళ్లు చేసిన మోసం. మీరు ఒక్కసారి డబ్బులు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేశాక అవి ఎప్పటికీ తిరిగి రావు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది ఇలాంటి మాటలు నమ్మి మోసపోయారు. తాజాగా హర్యానలో ఓ వ్యక్తి కూడా ఇలాంటి మోసానికి గురయ్యాడు. సైబర్ నేరగాళ్లు తన స్నేహితుల్లో ఒకరిలా మాట్లాడి రూ.30 వేలు దోచుకున్నారు. McAfee నివేదిక ప్రకారం, ఏఐ వాయిస్ క్లోనింగుకు దాదాపు 83 శాతం మంది భారతీయులు బలయ్యారు. భారీగా డబ్బు సంపాదిస్తున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

మీరు స్కామ్‌కు బలవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ముఖ్యంగా తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే, మీరు వారితో ఎలాంటి వ్యక్తిగత వివరాలు, అకౌంట్ నెంబర్లు, ఓటిపిలు షేర్ చేసుకోవద్దు.

వాయిస్ జాగ్రత్తగా వినాలి..

మీకు తెలిసిన వాళ్లు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారంటే.. అందులో వాయిస్ కొంచెం రోబోటిక్‌గా లేదా మెషీన్‌తో తయారు చేసినట్లు అనిపిస్తే, వెంటనే అప్రమత్తంగా అవ్వాలి. ఎందుకంటే మీరు సులభంగా ఏఐ మిషన్ నుంచి వచ్చే వాయిస్‌లో స్పష్టతను గమనించొచ్చు. ఎందుకంటే టెక్నాలజీలో వాయిస్ అంత పర్ఫె్క్టుగా ఉండదు. అయితే ఇంటర్నెట్లో వాయిస్‌లను క్లోన్ చేయడం చాలా సులభం. దీని కోసం అనేక రకాల ఏఐ టూల్స్ ఉన్నాయి. అందుకే మీ వాయిస్ రికార్డింగును ఏ పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లోనూ అప్‌లోడ్ చేయకండి.

లావాదేవీల విషయంలో..

మీకు ఎవరైనా ఫోన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు అడిగితే ఒకటికి, రెండుసార్లు ఆలోచించాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి అంటూ స్నేహితులు, బంధువుల నుంచి వాయిస్ మెసెజ్ వస్తే, దాన్ని మీరు కచ్చితంగా నిర్ధారించుకునేంత వరకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయకండి. ఇలాంటి సమయంలో మీరు నేరుగా వ్యక్తులను కలిసి లేదా మరేదైనా మార్గలో నిజాన్ని నిర్ధారించుకోండి. అంతేకానీ అలాంటి వాయిస్ మెసెజెస్ నమ్మి డబ్బులను కోల్పోవద్దు. తస్మాత్ జాగ్రత్త.