గూగుల్ గ్రామర్ చెక్ ఫీచర్ వచ్చేసింది.. ఇకపై గ్రామర్​ చెకింగ్ మరింత సులభం..!

Google Grammar Check feature has arrived.. Grammar checking is now easier..!
Google Grammar Check feature has arrived.. Grammar checking is now easier..!

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన గూగుల్ సెర్చ్‌లో వినియోగదారులకోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే గ్రామర్ చెక్ ఫీచర్‌ (Google Grammar Checker). ప్రస్తుతం ఇది కేవలం ఇంగ్లీష్ భాషకు మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో దీన్ని మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏఐ (Artificial intelligence) టెక్నాల‌జీతో తీసుకొచ్చిన ఈ గ్రామర్ చెక్ ఫీచర్ ద్వారా గూగుల్‌ సెర్చ్‌ బాక్స్‌లో ఒక పదాన్ని లేదా వాక్యాన్ని టైప్‌ చేసి.. వ్యాక‌ర‌ణ రీత్యా స‌రిగా ఉందాలేదా అని చెక్‌ చేసుకోవచ్చు. దీంతో ఇకపై గ్రామర్ చెకింగ్ కోసం థర్డ్ పార్టీ యాప్లు వాడాల్సిన అవసరం ఉండదు.
ఈ గ్రామర్ చెక్ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. ముందుగా గూగుల్ సెర్చ్ బాక్స్ .. ఏదైనా పదం లేదా వాక్యాన్ని టైప్ చేయాలి. తరువాత గ్రామర్ చెక్ లేదా చెక్ గ్రామర్ లేదా గ్రామర్ చెక్కర్ అని టైప్ చేయాలి.ఒక వేళ తప్పుగా ఉంటే రెడ్ చెక్ మార్క్ను చూపిస్తుంది. అయితే.. లోపాలు ఉంటే గూగుల్ ఆ వాక్యాన్ని సవరించి, దిద్దుబాట్లను హైలైట్ చేస్తుంది. స్పెల్లింగ్ తప్పులను కూడా పరిష్కరిస్తుంది. గూగూల్ గ్రామ‌ర్ చెక్ ఫీచ‌ర్‌ను డెస్క్ టాప్‌లోనూ, మొబైల్ ఫోన్‌లోనూ వినియోగించ‌వ‌చ్చు.