కొత్త తరహా థియేటర్లు వచ్చేశాయి

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Mobile Theaters Very popular in india

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటే సినిమా కూడా రకరకాలుగా మారుతూ వస్తుంది. మొదట మూకీ సినిమా ఉండేది, ఆ తర్వాత వాయిస్‌తో సినిమా వచ్చింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుండి ఈస్ట్‌మన్‌ కలర్‌కు, ఆ తర్వాత స్కోప్‌ సినిమా వచ్చింది. ఇప్పుడు సినిమా అనేది చాలా ప్రముఖ మాద్యమం. అందుకే ఇంకా ఈ విప్లవాత్మక మార్పులను తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం కొత్త తరహా థియేటర్లకు తెర లేస్తోంది. ఈమద్య కాలంలో మల్టీప్లెక్స్‌ థియేటర్ల సంఖ్య భారీగా పెరింది. ఆ థియేటర్లలో టికెట్ల రేట్లు చాలా అధికంగా ఉంటాయి. అందుకే కొత్త తరహా థియేటర్లు సిద్దం అయ్యాయి.

మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ఉండే విధంగా అన్ని వసతులతో తాజాగా మొబైల్‌ థియేటర్స్‌ రెడీ అయ్యాయి. దేశ రాజధాని హస్తినలో ప్రారంభం అయిన ఈ థియేటర్లు దేశ వ్యాప్తంగా త్వరలోనే విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతాయనే నమ్మకంతో అంతా ఉన్నారు. ప్రస్తుతం 10 మొబైల్‌ థియేటర్లు ఉన్నాయి. త్వరలోనే వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు. ఎక్కడైతే సినిమా డిమాండ్‌ ఉంటుందో అక్కడ ఈ మొబైల్‌ థియేటర్‌ ప్రదర్శణ ఉంటుందని, 200 మంది కూర్చుని చూసే విధంగా ఈ థియేటర్‌ను రెడీ చేశారు. ఈ థియేటర్లు చాలా పటిష్టమైన భద్రతను కలిగి ఉంటుందని చెబుతున్నారు.