మోడీ,షా కి వెంకయ్య విలువ ఇప్పుడు తెలిసొచ్చింది.

Modi and Shaw need Venkaiah

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజకీయాల్లో అప్రమత్తత ఎంత అవసరమో, నిరంతర అపనమ్మకం అంతకన్నా ప్రమాదం. ఈ విషయం ఇప్పుడిప్పుడే మోడీ,షా ద్వయానికి ఇప్పుడిప్పుడే అవగతం అవుతోంది. ఆ అపనమ్మకం తోటే అద్వానీ, జోషి, యశ్వంత్ సిన్హా వంటి సీనియర్స్ ని నిర్దాక్షిణ్యంగా పక్కనబెట్టింది ఈ జోడీ. అయినా తమ చేతుల్లో పుట్టిపెరిగిన బీజేపీ కి కీడు చేయలేక ఆ సీనియర్స్ అవమానాల్ని మౌనంగా భరిస్తూ వచ్చారు. దాంతో తమ వ్యూహాల మీద మోడీ, షాకి ఇంకా నమ్మకం పెరిగింది. అందుకే పార్టీ కష్టాల్లో వున్నప్పుడు ట్రబుల్ షూటర్ గా, పార్టీ మీద రాజకీయ ప్రత్యర్ధులు విరుచుకుపడుతున్నప్పుడు తన వాక్చాతుర్యంతో రక్షణ దళాధిపతిగా సేవలు అందించిన వెంకయ్య ని కూడా ఈ జంట రాజకీయం నుంచి విజయవంతంగా పక్కకి తప్పించగలిగింది. అయితే రోజులుఅన్నీ ఒకేలా వుండవు.

వెంకయ్యని అడ్డు తొలిగించుకున్న ఆనందం మోడీ,షా జంటకి కొద్ది నెలలు కూడా మిగల్లేదు. ఒక్కసారిగా ఆ జంటని సమస్యలు చుట్టుముట్టాయి. దేశవ్యాప్తంగా వివిధ చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో పూర్ రిజల్ట్, జీఎస్టీ కి వ్యతిరేకంగా వెల్లువెత్తిన వ్యతిరేకత,పెద్ద నోట్ల రద్దు దుష్పరిణామాలు ప్రజలకి ఇప్పుడిప్పుడే అవగతం అవుతున్న తరుణం, అంత్య కాలానికి దగ్గర అయిందన్న ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పునరుజీవం చెందడమే కాదు మోడీ, షా సొంత గడ్డ గుజరాత్ లోనే పెను సవాల్ విసరడం…ఇలా ఇన్నాళ్లు ఈ జంట ఏమి చేసినా కప్పేసిన పాజిటివ్ తెర తొలిగిపోయింది. అసలు సినిమా మొదలైంది. మోడీ అండ్ కో పరిస్థితిని కనిపెట్టి విపక్షాలు, సొంత పార్టీలో అసమ్మతులు, మిత్రపక్షాల నేతలు అంతా ఒక్కసారిగా దాడి పెంచారు. ఈ దాడిని సమర్ధంగా తిప్పికొట్టే నాయకుడే బీజేపీ లో లేకుండా పోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో ఏమి జరుగుతుందో మోడీ , షా జంటకి బాగా తెలుసు. అందుకే ఇప్పుడు వెంకయ్య ఉంటే బాగుండేది అని తీరిగ్గా బాధపడుతున్నారు. అందుకేనేమో చెరపకురా చెడేవు అని పెద్దలు చెప్పింది.