మోడీ దెబ్బకు కేసీఆర్ ఉలికిపాటు

modi calls to kcr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దళితుడ్ని అందలం ఎక్కిస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ రాష్ట్రపతిగా దళిత వ్యక్తిని ఎంపిక చేసి… విపక్షాలకు నోట మాట రాకుండా చేసింది. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ అలా కాదు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే దళితుడ్ని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు. తెలంగాణ వస్తే తనకు అధికారమే అక్కర్లేదన్నారు. అవసరమైతే పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని సోనియాకు నమ్మబలికారు. కానీ అనుకున్న పని జరగ్గానే అందరికీ ఖో చెప్పారు కేసీఆర్.

పసి తెలంగాణను జాగ్రత్తగా సాకాలని, అందుకే సీఎం పదవి తీసుకున్నానని కేసీఆర్ చెప్పిన మాటలు చూస్తే… నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. చేసింది పాడుపనైనా సమర్థించుకోవడంలో మాత్రం కేసీఆర్ ను మించిన మొనగాడు లేడన్నది నిర్వివాదాంశం. అలాంటి కేసీఆర్ కూడా మోడీని చూసి ఉలిక్కిపడుతున్నారు. దళితుడ్ని రాష్ట్రపతి చేస్తున్నామని ఫోన్ చేయగానే… మరో ఆలోచన లేకుండా ఆమోదించడం వెనుక… తన ఎన్నికల హామీ గుర్తొచ్చే అంటున్నారు విశ్లేషకులు.

ఇప్పటికీ దళిత సంఘాలు కేసీఆర్ హామీనే గుర్తుచేస్తూనే ఉంటాయి. ఎన్నో అబద్ధాలు చెప్పి కేసీఆర్ గద్దెనెక్కారని మొన్నటికి మొన్న జేఏసీ ఛైర్మన్ కోదండరాం కూడా అన్నారు. ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండానే కోదండరాం వాగ్బాణాలు కేసీఆర్ కు గట్టిగానే గుచ్చుకుంటున్నాయి. 2019 అంత వీజీ కాదని సర్వే సీన్ కనిపిస్తూనే ఉంది. మరి కేసీఆర్ ఏం చేస్తారో..?