కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్

కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్

కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువస్తోంది. దీంతో వాహనదారులు కచ్చితంగా రెండు పనులు చేయాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వాలిడిటీని, వాహన రిజిస్ట్రేషన్ వాలిడిటీ వివరాలను కచ్చితంగా వెహికల్‌పై నిబంధనలకు అనుగుణంగా డిస్‌ప్లే చేయాల్సి ఉంటుంది. లేదంటే రూల్స్‌ను అతిక్రమించినట్లే అవుతుంది. అందువల్ల వాహనదారులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

కేంద్ర రోడ్డు రవాణ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం.. హెవీ గూడ్స్/ ప్యాసింజర్ వెహికల్స్, మీడియా గూడ్స్/ ప్యాసింజర్ వెహికల్స్, తేలికపాటి మోటార్ వెహికల్స్ కచ్చితంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వాలిడిటీని విండ్‌స్క్రీన్ ఎడమ వైపునకు పైభాగంలో అతికించాల్సి ఉంటుంది. అదే ఆటో రిక్షాలు, ఇరిక్షాలు, ఇకార్ట్స్‌, క్వాడ్రిసైకిల్స్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వాలిడిటీని విండ్‌‌స్క్రీన్‌కు ఎడమ వైపున పైనే ఉంటుంది.

అదే మోటార్‌సైకిల్స్ విషయానికి వస్తే.. ప్రస్ఫుటంగా కనిపించే భాగంలో దీన్ని అతికించాల్సి ఉంటుంది. కాగా పసుపు రంగులో బ్లూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏరియల్ బోల్డ్ స్క్రిప్ట్‌లో వివరాలను డిస్‌ప్లే చేయాల్సి ఉంటుంది. డేట్- మంత్- ఇయర్ ఫార్మాట్‌లో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉంటుంది. దీన్ని వెహికల్ కలిగిన వారు వారి వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికించాల్సి ఉంటుంది.

కాగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం వాహన దారులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. హిట్ అండ్ రన్ ప్రమాదాలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఇకపై 8 రెట్లు అధిక పరిహారం లభించనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిర్ణయం అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల వరకు  పరిహారం లభిస్తుంది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి కూడా ఆర్థిక సాయం పెంచారు. వీరికి రూ.50 వేలు లభించనున్నాయి. ప్రస్తుతం వీరికి రూ.12,500 చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి పెంపు నిర్ణయం అమలులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రోడ్డుప్రమాద బాధితులకు చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవాలి. కాగా ప్రతి ఏటా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.