ఆలోపే ఏపీ మీద మోడీ దండయాత్ర.

Modi will attacks On TDP and YSRCP In AP Before elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాజకీయాల్లో చెప్పిన మాట నిలబెట్టుకోకపోయినా సరే ప్రత్యర్థి మీద ఎదురు దాడితో ఆ గండం నుంచి బయట పడొచ్చని నాయకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు టీడీపీ చేసే అవినీతి ఆరోపణల మీద ఇదే ఎదురు దాడి అస్త్రాన్ని ఆయన విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని వై.ఎస్ కొడుకు జగన్ మీద చంద్రబాబు సంధిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు అన్నిటినీ తుంగలో తొక్కిన మోడీ సర్కార్ కూడా ఇదే దారి ఎంచుకుంది. పార్లమెంట్ వేదికగా విభజన సమస్యల మీద ఆంధ్ర ఎంపీల పోరాటం మొదలు అయినప్పటినుంచి ఎదురు దాడి మొదలెట్టిన బీజేపీ ఇంకాస్త దూకుడు పెంచాలి అనుకుంటోంది. అందులో భాగమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు వరస ప్రెస్ మీట్స్. ఆంధ్రులు చేస్తున్న డిమాండ్స్ గురించి మాట్లాడకుండా ఏదేదో చెప్పి ఎంతో చేస్తున్నాం అని చెప్పుకునే ధైర్యం చేస్తున్న బీజేపీ ప్రజల్ని మరీ అమాయకులు అనుకుంటోంది. అందుకే కాబోలు తాము చెప్పే అసత్యాలు, అర్ధ సత్యాలు సాక్షాత్తు మోడీ నోటి నుంచి ఆంధ్ర గడ్డ మీద నుంచే వినిపించేందుకు సిద్ధం అవుతోంది.

ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ వచ్చి చంద్రబాబు సర్కార్ మీద దండయాత్ర చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం నిధులతో జరుగుతున్న ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గోడానికి మోడీ రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆరా తీస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ని అధికారికంగా దీనిపై వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికిప్పుడు మోడీ ఇలా ఆంధ్రప్రదేశ్ వచ్చి మరీ ప్రజలకు వివరణ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. మార్చి 5 తర్వాత కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు వైదొలగొచ్చని మోడీ దగ్గర కచ్చితం అయిన సమాచారం ఉందట. బాబు అంతటితో ఆగకుండా ఎంపీల తో రాజీనామా చేయించి విభజన హామీల మీద పోరాటం ఉధృతం చేసే ఛాన్స్ ఉందని మోడీకి సమాచారం ఉందట. అందుకే ఈ లోపే చంద్రబాబు సర్కార్ తాము ఇచ్చిన నిధులకు జవాబుదారీగా లేకపోవడంతోటే మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి అడ్డంకి అవుతోందని మోడీ చెప్పే ఛాన్స్ వుంది. ఆయన ఏమి చెప్పినా ఆంధ్ర ప్రజలు బీజేపీ ని నమ్మే పరిస్థితి లేదని కేంద్ర ఇంటలిజెన్స్ పక్కాగా చెప్పిందట. అయినా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకు దండయాత్ర ఆరాపడుతున్న మోడీ మొండితనాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే.