ఆ కోర్కె తీర్చుకోనున్న మోహన్‌బాబు

Mohan Babu Directing A Film Bhaktha Kannappa With 75 crs Budget

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Mohan Babu Directing A Film Bhakta Kannappa With 75 Crore Budget

మోహన్‌బాబు ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. హీరోగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మంచి చిత్రాలను అందించిన మోహన్‌బాబు ఇప్పటి వరకు దర్శకుడిగా మాత్రం ప్రయత్నించలేదు. కెరీర్‌ ఆరంభంలో సహాయ దర్శకుడిగా కూడా చేసిన మోహన్‌బాబు ఆ తర్వాత దర్శకత్వంపై ఆలోచన ఉన్నా కూడా తన వల్ల కాదు అనే ఉద్దేశ్యంతో నటనపై ఎక్కువ శ్రద్ద చూపించడం, తర్వాత అభిరుచితో సినిమాలు నిర్మించడం ప్రారంభించాడు. 50 సినిమాలు నిర్మించిన అనుభవం ఉన్న మోహన్‌బాబు ఇప్పుడు ఒక భారీ సినిమాకు దర్శకత్వం వహించాలనే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

చాలా రోజుల క్రితం మంచు విష్ణు హీరోగా తనికెళ్ల భరణి దర్శకత్వంలో ‘భక్తకన్నప్ప’ అనే చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్‌ ప్రకటనతోనే పరిసమాప్తం అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ప్రాజెక్ట్‌ గురించిన వార్త ఒకటి సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అదే మోహన్‌బాబు దర్శకత్వంలో భక్తకన్నప్ప. తనికెళ్ల భరణి స్క్రిప్ట్‌తో బాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ మరియు ప్రముఖ నటీనటులతో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళంలో ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మించాలని మోహన్‌బాబు భావిస్తున్నాడు. దాదాపు 75 కోట్ల బడ్జెట్‌ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడిగా మొదటి ప్రయత్నమే ఈస్థాయిలో ప్రయత్నం చేస్తే మోహన్‌బాబుకు అరుదైన రికార్డు దక్కుతుంది. మోహన్‌బాబు దర్శకత్వం చేపట్టాలంటే మరికాస్త సమయం కావాలని ఆయన సన్నిహితులు అంటున్నారు. 2020లో ‘భక్తకన్నప్ప’ వచ్చేలా మోహన్‌బాబు ప్లాన్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు :

మనోజ్‌ జోక్‌ చేశాడా?

తిక్కతిక్క వేషాలు వేయమాకు..!