‘షకీలా’లో సూపర్‌ స్టార్‌ను టార్గెట్‌…!

Mohanlal Mammootty Against Shakeela Mlayalam Film

మలయాళ సినీ పరిశ్రమను ఒక కుదుపు కుదిపేసిన షకీలా బయోపిక్‌ ప్రస్తుతం భారీ ఎత్తున తెరకెక్కుతోంది. బాలీవుడ్‌లో రూపొందుతున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో అంచనాలను కలిగి ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. షకీలా టైటిల్‌తో రాబోతున్న ఈ బయోపిక్‌లో మలయాళ సూపర్‌ స్టార్స్‌ గురించిన షాకింగ్‌ విషయాలను బయట పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అప్పట్లో మలయాళ స్టార్స్‌ మోహన్‌లాల్‌ మరియు మమ్ముటీలు భారీ ఎత్తున షకీలా మూవీలను ఆప్‌ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాల కారణంగానే షకీలా సినీ కెరీర్‌ నాశనం అయ్యిందని కొందరు ఇప్పటికి అంటూ ఉంటారు.

Mohanlal-Mammootty

అప్పట్లో స్టార్‌ హీరోల సినిమాలకు పోటీ ఇచ్చి మరీ షకీలా మూవీస్‌ భారీగా వసూళ్లు సాధించేది. అందుకే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. షకీలా అన్ని విషయాలను ఈ చిత్రంలో క్లీయర్‌గా చూపించబోతుందటూ వార్తలు వస్తున్న కారణంగా, ఆ మలయాళ సూపర్‌ స్టార్స్‌ పేర్లను కూడా ఈ చిత్రంలో ప్రస్థావించే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన విషయాలను చూపించే సమయంలో తన కెరీర్‌ నాశనం కావడంకు కారనం అయిన వారి గురించి కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో ఆ స్టార్‌ హీరోలు ప్రస్తుతం షకీలా బయోపిక్‌ కారణంగా టెన్షన్‌ పడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

shakela