ట్యాక్సీవాలా దర్శకుడు కనిపించడం లేదే…!

Vijay Devarakonda On About Taxiwaala Movie Promotions

విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో ఎక్కువగా విజయ్‌ దేవరకొండ మాత్రమే కనిపిస్తున్నాడు. కాని దర్శకుడు రాహుల్‌ సంకీర్తన్‌ మాత్రం ప్రమోషన్స్‌లో కనిపించడం లేదు. సినిమా గురించి మొదటి నుండి నెగటివ్‌ టాక్‌ వస్తున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో కొత్త దర్శకుడు అంటూ ప్రచారం చేయడం వల్ల సినిమాకు ఇంకాస్త డ్యామేజీ జరుగుతుందనే ఉద్దేశ్యంతో నిర్మాతలు ఈ చిత్రాన్ని కేవలం విజయ్‌ దేవరకొండ పేరుతోనే పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రంతో యమ క్రేజ్‌ను దక్కించుకున్నాడు. కనుక ఆ చిత్రంతో తప్పకుండా ట్యాక్సీవాలాకు పాజిటివ్‌ బజ్‌ వస్తుందని ఆశిస్తున్నారు.

Vijay Deverakonda Taxiwala Movie

‘ట్యాక్సీవాలా’ చిత్రం విడుదలకు ముందే లీక్‌ అయ్యింది. దాంతో సినిమా ప్రమోషన్‌ విషయంలో విభిన్నమైన ప్లాన్‌ను అవలంభిస్తున్నారు. మా సినిమా లీక్‌ అయ్యింది. సినిమా లీక్‌ అవ్వడం వల్ల యూనిట్‌ సభ్యులు అంతా కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అంటూ విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు. సినిమా లీక్‌ అయ్యిందనే సానుభూతిని ఈ చిత్రం ప్రమోషన్‌ కు ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘డియర్‌ కామ్రెడ్‌’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఆ చిత్రం కంటే ‘ట్యాక్సీవాలా’ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా ఆసక్తి నెలకొంది.

rahul-vijay