అక్కడ కుడా VD గురించి మారు మ్రోగుతోంది…!

Vijay Devarakonda Next Project In Bollywood

ఆర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాల చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. నోటా చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా విజయ్ చేరువ అయ్యాడు. తమిళంలో కూడా విజయ్ తో సినిమా తియ్యాలని దర్శక నిర్మాతలు లైన్ కడుతున్నారు. విజయ్ దేవరకొండ నుండి ఇటివల విడుదలైన టాక్సీ వాల చిత్రం నెల రోజుల ముందే నెట్ లో హల్చల్ చేసింది. కానీ విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజీ వలన ఆ సినిమా విడుదలై మంచి విజయాని దక్కించుకోవడంతో పాటుగా, నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఇప్పుడు విజయ్ కు తెలుగులో అంత ఇంత క్రేజీ లేదు. ఇప్పుడు విజయ్ పేరు తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోను మారుమోగుతుంది. ఆ మద్య శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కరణ్ విత్ కాఫీ షో లో విజయ్ ఆటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నది. అలగే కరణ్ కూడా సౌత్ సెక్సియస్ట్ హీరో అంటూ కితాబ్ ఇచ్చాడు.

ఆ మద్య విజయ్ దేవరకొండతో బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తానునని చెప్పాడు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఈ లిస్టు లోకి యష్ రాజ్ నిర్మాణ సంస్థ అధినేత ఆదిత్య చోప్రా చేరాడు. విజయ్ ను బాలీవుడ్ కి రప్పించాలని కరణ్, ఆదిత్య చోప్రా లు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. బాలీవుడ్ లో మాత్రం విజయ్ పేరు మాత్రం భాగా మారుమోగుతుంది. విజయ్ మాత్రం ప్రస్తుతం తెలుగులోనే చాలా సినిమాలకు కమిట్ మెంట్స్ ఇచ్చాడు. విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రం తో చాలా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకులముందుకు తీసుకురావాలని విజయ్ ప్రత్నిస్తున్నాడు. ఆ చిత్రం తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. విజయ్ బాలీవుడ్ ఎంట్రి ఒక్కవేల 2020లో ఉండవచ్చు అంటున్నారు.