96 చెయ్యాలనే ఉంది.. చర్చలు జరుగుతున్నాయి…!

Sharwanand Confirms About 96 Remake

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం 96. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాని దక్కించుకుంది. ఇప్పుడు ఈ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ దక్కించుకున్నాడు. ఈ చిత్రం కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రం అసలు స్టొరీ ఏమిటి అంటే స్కూల్ డేస్ లో ప్రేమించుకున్న అమ్మాయి, అబ్బాయి , తిరిగి చాలా కాలం తరువాత గెట్ టు గెదర్ లో కలుసుకుంటారు. అప్పుడు వారి మద్య జరిగే పరిణామాలను దర్శకుడు అద్భుతంగా రూపొందించాడు. ఇప్పుడు ఈ చిత్రంను తెలుగు నేటివిటి తగిన విధంగా మార్పులు, చేర్పులు చేస్తూ రీమేక్ చెయ్యాలని నిర్మాత దిల్ రాజ్ భావిస్తున్నాడు. ముందుగా ఈ చిత్రం రీమేక్ లో అల్లు ఆర్జున్, గోపీచంద్ పేర్లు వినిపించాయి కానీ వారికీ ఈ సినిమా సెట్ అవ్వదని భావించి పక్కకు తప్పుకున్నారు.

తాజాగా మరో హీరో శర్వనంద్ వచ్చి చేరాడు. 96మూవీ పై శర్వ ఓ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి చర్చలు సాగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన ఉంటుంది అన్నాడు. ప్రస్తుతం శర్వానంద్ పడి పడి లేచే మనసు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా శర్వ మీడియా తో మాట్లాడుతూ… తమిళ 96 మూవీలో నటించడం అంటే ఓ చిన్న ప్రయోగం, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. ప్రేక్షకులు ఎలా రిసివ్ చేసుకుంటారు అనేది ఏమి చెప్పలేం. కానీ ఓ మంచి సినిమాలో నటించాను అనే తృప్తి మాత్రం మిగులుతుంది. త్వరలో ఈ చిత్రంపైన పూర్తి వివరాలు తెలుస్తాయి. పడి పడి లేచే మనసు సినిమా తరువాత సుధీర్ వర్మ డైరక్షన్ లో దళపతి అనే సినిమా చెయ్యలిసిన్నది. అన్నారు. వచ్చే ఏడాది వేసవి నుండి సుధీర్ వర్మ షూటింగ్ స్టార్ట్ అవ్వుతుంది.