తల్లీకూతుళ్లు ఒకేసారి ఉరేసుకొని ఆత్మహత్య

అంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మర్రిపూడిలో ఘోరం జరిగింది. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు గానీ… తల్లీ, కూతుళ్లు ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. స్థానిక పొట్టిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సందల జనార్దన్‌ రెడ్డితో సుమారు పదిహేనేళ్ల క్రింత కోటేశ్వరమ్మతో పెళ్లైంది. వీరికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీ పనుల్లో భాగంగా భర్త జనార్దన్‌రెడ్డి గేదెలకు గడ్డికోసం పొలానికి వెళ్లాడు.

అదే సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని తల్లీకూతురు మృతురాలుగా ఉండటాన్ని మామ ఒక్కెయ్య చూశాడు. వెంటనే కుమారుడుకి తెలిపాడు. కాగా కొడుకు పొలం నుంచి తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య కోటేశ్వరమ్మ(32), ఆమె కూతురు నందిని(13) ఇద్దరు ఒకే మంచంపై మరణించి ఉన్నారు. కాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురు నందినికి కుర్చీ ఎక్కించి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసి ఉండవచ్చని.. ఆ తర్వాత అక్కడే ఉన్న కందుల బస్తాల పైకి ఎక్కి తల్లి కోటేశ్వరమ్మ కూడా అదే చీరతో మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉంటుందని స్థానిక ఎస్సై సుబ్బరాజు తెలిపారు.

కాగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతుంటాయని.. దీంతో మనస్థాపానికి గురైన కోటేశ్వరమ్మ ఇలాంటి పనికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కూతురు మర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. అయితే ఈ విషయం తెలియగానే బంధువులు, గ్రామస్తులు ఒక్కసారిగా సోకసంద్రంలో మునిగారు. పొట్టిరెడ్డిపాలెం గ్రామంలో ఆరు నెలల వ్యవధిలో నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అక్కడ కలకలం రేపుతోంది.