బిగ్ షాకింగ్.. యజమాని ద్వారా పిల్లికి కరోనా

బెల్జియంలో ఒక పెంపుడు పిల్లికి తన యజమాని ద్వారా కరోనా వైరస్ సోకినట్లు బెల్జియం ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే ముఖ్యంగా పెంపుడు జంతువులక జబ్బులు రావడం అందులోను ఇలాంటి వైరస్ లు సోకడం చాలా అరుదుగా ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే.. ఇంటి జంతువుల నుండి అయినా కూడా యజమానులు జాగ్రత్తగా ఉండాలని.. మొత్తం మీద 17 కుక్కలు, ఎనిమిది పిల్లులపై వైరస్ సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన హాంగ్ కాంగ్‌ నివేదికల్లో కూడా నమోదయ్యింది. వారి నివేదికల్లో భాగంగా రెండు కుక్కలు కోవిద్-19కు పాజిటివ్ పరీక్షలు నిర్వహించగా.. వాటికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణమైనట్లు తెలిపారు.

అదేవిధంగా బెల్జియంలోని వెటర్నరీ అధికారులు మాట్లాడుతూ.. ఇది ఒక వినూత్నమైన కేసు అని వెల్లడించారు. జంతువులకు మానవులకు మధ్య సన్నిహిత సంబంధం ద్వారానే ఇలాంటి ఘటన సంభవించి ఉంటుందని.. ఈ వైరస్ మానవుల నుండి జంతువులకు వ్యాపిస్తుందని వివరించారు. కానీ ‘మన సమాజంలో జంతువులకు ఇది అంటువ్యాధిగా మారుతుందో లేదో తెలియని వినూత్నమైన పరిస్థితి నెలకున్నది’ అని వైద్య అధికారులు తెలిపారు. కాగా హాంకాంగ్‌లో.. కుక్కలు మాత్రం ఎటువంటి విపరీత లక్షణాలను చూపించడం లేదని.. బెల్జియంలో మాత్రం పిల్లి తాత్కాలిక శ్వాసకోశ, జీర్ణ సమస్యలతో బాధపడుతోందని బెల్జియం ఆహార భద్రతా సంస్థ ఏఎఫ్ఎస్సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా.. పెంపుడు జంతువులతో వ్యవహరించేటప్పుడు పరిశుభ్రత.. సరైన నియమాలు పాటించడం ముఖ్యమని అధికారులు వెల్లడించారు. పెంపుడు జంతువులతో సన్నిహిత సంబంధాన్ని తగ్గించుకోవాలని… ఏదైనా జంతువును ముట్టుకున్న తర్వాత చేతులు కడుక్కోవాలని, జంతువుల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడం మన ముఖ్య కర్తవ్యం అని అధికారులు వివరించారు.